Pawan Kalyan – Sai Dharam Tej PKSDT title: పవన్ కళ్యాణ్ అలాగే సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా PKSDT టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. గత వారం రోజుల నుంచి సినిమా టైటిల్ ఇవే అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. అయితే ఈరోజు జర్నలిస్ట్ అలాగే మూవీ క్రిటిక్స్ PKSDT title ఫిక్సయినట్టు సోషల్ మీడియా ద్వారా లీక్ చేయడం జరిగింది.
సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వినోదయ సీతమ్ రీమేక్ గా వస్తుంది. PKSDT సినిమా షూటింగు ప్రస్తుతం హైదరాబాదు లొకేషన్స్ లో జరుగుతుంది అలాగే 90% కూడా కంప్లీట్ చేయటం జరిగిందంటూ మూవీ టీం చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అలాగే సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మొదటిసారిగా కలిసి వస్తున్న సినిమా కావటంతో భారీ అంచనాలు ఉన్నాయి. PKSDT title “BRO” అనే టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అలాగే ఈ టైటిల్ సంబంధించి ట్విట్టర్ అకౌంట్ లో కూడా మూవీకి క్లోజ్ గా ఉండే వారి అకౌంట్స్ లో కూడా ఈ టైటిల్ పోస్ట్ చేయటం కూడా జరిగింది. BRO టైటిల్ పెట్టడానికి కూడా కారణం అనేది ఉంది అంట. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని BRO అని పిలుస్తారు అంట. అందుకనే సినిమా టైటిల్ కూడా అదే పెట్టడం జరిగిందంటూ సోర్స్ చెబుతున్నారు. PKSDT సినిమాకు సంబంధించిన టైటిల్ ని మరో రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ సినిమా వర్గాలు వారు చెప్తున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి డైలాగ్స్, స్క్రీన్ చేస్తున్నారు. PKSDT సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. మేకర్స్ PKSDT title BRO సినిమాని జులై 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పై క్లారిటీ రానుంది.
Web Title: Pawan Kalyan Sai Dharan Tej movie title BRO, BRO title confirmed for PKSDT movie, PKSDT shooting update, PKSDT Release date, PKSDT title