pawan kalyan says special thanks and emotional comments on allu arjun help

Pawan Kalyan Thanks to Allu Arjun Ram Charan: పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా భారీ కటౌట్ కడుతూ ప్రమాదవశాత్తు మరణించిన తన అభిమానుల కుటుంబాలకు చెక్కులు అందించారు పవన్. ఈ సందర్భంగా అల్లు అర్జున్, రామ్ చరణ్, దిల్ రాజు, మైత్రి నిర్మాతకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

అల్లు అర్జున్, రామ్ చరణ్‌లకు పవన్ కళ్యాణ్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఈ నెల 2వ తేదిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్‌తో చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు కన్నుమూసిన సంగతి తెలిసిందే.. ఈ విషయం తెలిసిన వెంటనే ప‌వ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించారు. ఆ వెంటనే విషయం తెలిసి అల్లు అర్జున్, రామ్ చరణ్, దిల్ రాజు, ఏఎం రత్నం సహా కొందరు ఎన్నారైలు తమ తమ సాయం ప్రకటించారు.

నిన్న (శుక్రవారం) పవన్ కళ్యాణ్ సహా వాళ్లంతా అందించిన ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపంలో బాధిత కుటుంబాలకు అందజేశారు జనసేన నాయకులు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ 13.25 లక్షల చెక్‌తో పాటు గాయపడిన వారికి ఒక్కొక్కరికీ 1.25 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా తన అభిమానుల కుటుంబాల సహాయార్థం మానవత్వంతో ముందుకొచ్చి సాయం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్స్ పెట్టారు పవన్ కళ్యాణ్.