పవన్ స్థానాన్నిఅకిరా నందన్ డామినేట్ చేస్తాడా.. ?

0
506
Pawan Kalyan Son Akira Nandan debut with Adivi Sesh Major movie

అకిరా నందన్ సినిమాలలోకి రావాలని ఎప్పటి నుంచో పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. మొదట్లో సినిమాల పట్ల పెద్దగా ఆశక్తి కనపరచని అకిరా ఇప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తున్నాడు అంటూ ఈమధ్య రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ తాజా ఫిలింనగర్ సమాచారం ప్రకారం.. అకీరా ఎంట్రీ 2011లో ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అడివి శేష్ `మేజర్` మూవీతో అరంగేట్రం చేయడానికి అకిరా నందన్ సిద్ధమవుతున్నారని ప్రచారం సాగతోంది.

అకిరా నందన్ అడవిశేషు అభిమాని ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో మెగా అభిమానులు కూడ ఆశ్చర్యపోయారు..శేష్ ప్రధాన పాత్రలో మేజర్ మూవీ ఇటీవలి ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ మూవీని ఘట్టమనేని బ్యానర్ లో మహేష్ స్వయంగా నిర్మిస్తుండడం నమ్రత ప్రతిదీ చూస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ పెరిగింది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం అకిరా మేజర్ మూవీలో ప్రత్యేక పాత్రను చేయబోతున్నాడని వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ మూవీలో ఉన్ని కృష్ణన్ టీనేజ్ పాత్రను అకిరా చేత చేయించాలని దర్శకుడు శశి కిరణ్ టిక్క చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో పవన్ ఫ్యాన్స్ లో ఆరాలు మొదలయ్యాయి. నిజానికి అకీరా ఎంట్రీ ఘనంగా ఉండాలన్నది పవన్ కల్యాణ్ అభిమానులు ఆకాంక్ష. ఇలా అతిథి పాత్రలో కాకుండా పూర్తి స్థాయి పవర్ ప్యాక్డ్ సినిమాతో రంగంలోకి దిగాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఈ మూవీ నిర్మాతలు రేణు దేశాయ్ తో చర్చలు జరపడం ఆమె అకిరా ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు వ్యక్తిగతంగా అకిరా కు కూడ ఈ సినిమాలో నటించాలని కోరిక ఉన్నట్లు తెలుస్తోంది. మరి అతడిపై ఊహాగానాలు నిజమవుతాయా? అన్నదానికి సరైన ఆన్సర్ రావాల్సి ఉంది. అదే జరిగేతే అకిరా నందన్ పాపులారిటీ పవన్ ఇమేజ్ తో పోటీ పడినా ఆశ్చర్యం లేదు..

Previous articleబాయ్ ఫ్రెండ్ తో రచ్చ.. లవ్ కన్ఫర్మ్ చేసిన పాయల్..!
Next articleIIT Krishnamurthy Trailer Released By Harish Shankar