Trailer talk, Movie Reviews, Telugu cinema updates, Tollywood actress latest news, stills, boxoffice,
Trailer talk, Movie Reviews, Telugu cinema updates, Tollywood actress latest news, stills, boxoffice,

పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ అనూహ్యం.కెరీర్ స్టార్టింగ్ లోనే ట్రెండీ సినిమాలతో యూత్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న పవన్ మాస్ సినిమాలతో కూడా క్లాస్ ఆడియన్స్ ని అలరించేవాడు.అందుకే పదేళ్ల పాటు హిట్ లేకపోయినా సినిమా ఆఫర్స్ గాని,ఓపెనింగ్స్ కలెక్షన్స్ గాని రాక్ స్టడీ గా ఉన్నాయి.అయితే పవన్ క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకో,లేక సౌత్ ఇండియాకో పరిమితం కాలేదు.ఖండాలు కూడా దాటి ఇంటర్నేషనల్ వేదికలపై కూడా రచ్చ చేసింది.

వరల్డ్ ఆఫ్ డాన్స్ అనే ఇంటర్నేషనల్ డాన్స్ షో చాలా పాపులర్.ఆ షో లో విజేతలుగా నిలిచిన వాళ్లకు ఏకంగా 1 మిలియన్ డాలర్స్…అంటే పది లక్షల డాలర్స్ ప్రైజ్ మనీ ఉంటుంది.అలాంటి షో ఫైనల్స్ లో ఇండియా నుండి వెళ్లిన ది కింగ్స్ అనే గ్రూప్ సర్దార్ గబ్బర్ సింగ్ పాటని,వారియర్ బ్యాక్ డ్రాప్ తో కలిపి పెర్ఫార్మ్ చేసారు.ఆ పాట పెర్ఫార్మ్ చేసిన ది కింగ్స్ ఆ షో విన్నర్స్ గా నిలిచి వన్ మిలియన్ డాలర్స్ ప్రైజ్ మనీ అందుకున్నారు.

అయితే వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసిన జెన్నిఫర్ లోపెజ్ మాత్రం ఒక రేంజ్ లో ఎక్సైట్ అయ్యి పొగడ్తల వర్షం కురిపించింది.అసలు పరిచయం లేని భాషలో ఉన్న పాట అక్కడ ఉన్న వాళ్ళను అంతగా ఆకట్టుకోవడం,వాళ్ళకు అంతగా కనెక్ట్ అవ్వడం మాత్రం ఆశ్చర్యకరం.దీంతో పవన్ ఫ్యాన్స్ కి ఇది ఒక సెలబ్రేషన్ మూమెంట్ లా మారింది.అపుడెపుడో అట్టర్ ఫ్లాప్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి మ్యూజిక్ అందించినందుకు దేవి కి ఇప్పుడు క్రెడిట్ దక్కడం విశేషం.అలాగే పవన్ క్రేజ్ కే ఇమేజ్ కి బౌండరీస్ లేవు అనేది కూడా నిజం.