వకీల్ సాబ్ మూవీ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్

0
324
Pawan Kalyan Starrer Vakeel Saab Movie Shooting Continues In Hyderabad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఈ భారీ క్రేజీ మూవీకి ఏంసీఏ డైరెక్టర్ వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాను కేవలం మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలనుకున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ ఏడాది సమ్మర్ లోనే సినిమా విడుదల అయ్యేది. కాని కరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలల పాటు షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక పవర్ స్టార్ అభిమానులు అయితే… ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లోకి వస్తుందా అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

లాక్‌డౌన్ ముగిశాక ఓ షెడ్యూల్‌లో పాల్గొన్న ఆయన కాస్త విరామం తీసుకున్నారు. తాజాగా కీలక సన్నివేశాల చిత్రీకరణ మళ్లీ సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్లాష్ బ్యాక్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ షూటింగులో పవన్‌తో పాటు హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా పాల్గొంటోంది. ఇటీవల హీరోయిన్ శృతి హాసన్ మాట్లాడుతూ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో తాను జనవరి నుండి పాల్గొంటాను అంటూ చెప్పుకొచ్చింది.

ఇప్పటికే తుది దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ ఈ షెడ్యూల్‌తో పూర్తవుతుందని యూనిట్ చెబుతోంది. హిందీ ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. నివేదా థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కఫూర్ సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ను జనవరిలో అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.