పూజా కార్యక్రమాలతో మొదలైన పవన్ కళ్యాణ్ రీమేక్ చిత్రం

0
184
Ayyappanum Koshiyum Telugu Remake Starring Pawan Kalyan and Rana

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇది మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు తెలుగు రీమేక్ అని తెలుస్తోంది. ఇప్పుడు తెలుగులో బిజూ మీనన్ పోషించిన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనుండగా.. అతనికి ధీటుగా నిలిచే పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రం కొద్ది సేపటి క్రితం అఫీషియల్‌గా లాంచ్ అయింది. పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా, త్రివిక్రమ్ స్విచాన్ చేశారు. జనవరి నుండి మూవీ షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట. తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి భల్లాలదేవుడుని ఆహ్వానిస్తూ చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. పవర్ స్టార్ తో మ్యాచో మ్యాన్ జాయిన్ అవుతున్నట్లు ఇందులో పేర్కొన్నారు. థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు.

 

 

Previous articleకేజీఎఫ్‌2 సర్‌ప్రైజ్‌ : యశ్‌ బర్త్‌డే సూపర్ గిఫ్ట్‌
Next articleజగన్‌ను ఆకాశానికి ఎత్తేసిన చిరు, మహేష్ బాబు