సురేందర్ రెడ్డి, పవన్ మూవీ అప్డేట్..!

0
448
Pawan kalyan Surender reddy Movie Update

PSPK29: పవన్ బర్త్ డే వేడుకలను మరింత ప్రత్యేకం చేయడానికి ఇప్పుడు ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి వంతు వచ్చింది. సురేందర్ రెడ్డి, పవన్ కాంబోలో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ బర్త్ డే కానుకగా సురేందర్ రెడ్డి – పవన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

”యథా కాలమ్.. తథా వ్యవహారమ్” అంటూ సంస్కృతంలోని లైన్స్ తో పవన్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఇందులో ఓవైపు గన్ మరోవైపు హైదరాబాద్ నగరాన్ని చూపిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్ కథతో రాబోతున్నట్లు ఈ ఆసక్తికరమైన ప్రీ లుక్ పోస్టర్ తోనే హింట్ ఇచ్చారు. స్టైలిష్ సినిమాలకు పెట్టింది పేరైన సురేందర్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ ను ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి వరుస అప్డేట్స్ రావడంతో మెగా అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ నేడు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు నిన్ననే ప్రకటించారు. “వకీల్ సాబ్”తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన పవన్ తరువాత వరుస సినిమాలను లైన్ లో పెట్టేశారు.

Pawan kalyan Surender reddy Movie Poster Released

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న “భీమ్లా నాయక్” నుంచి ఉదయాన్నే అప్డేట్ వచ్చేసింది. “భీమ్లా నాయక్” టైటిల్ సాంగ్ మెగా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది.