Pawan Kalyan Upcoming movie shooting update: పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు సమానంగా చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే 2024 ఎలక్షన్స్ దగ్గర పడటంతో ఇప్పుడు చేస్తున్న సినిమా షూటింగు అన్నిటికి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ టార్గెట్ అన్ని సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని రాజకీయాల్లో ఫుల్ బిజీ కావాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారంట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, PKSDT అలాగే సుజిత్ దర్శకత్వంలో వస్తున్న OG సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.
Hari Hara Veera Mallu Shooting Update: పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ఈ మూడు మూవీస్ షూటింగ్ అప్డేట్స్ గురించి తెలుసుకుంటే, క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు షూటింగు హోల్డ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఒక్క సీను డీటెయిల్ గా తీయాలని పవన్ కళ్యాణ్ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచే చెపుతున్నారంట అందుకని ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ గురించి తెలియాల్సి ఉంది.
ustaad bhagat singh shooting update: ఇక సాయిధరమ్ తేజ్ అలాగే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్లో వస్తున్న PKSDT సినిమా షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ని త్వరలోనే విడుదల చేసే పనిలో ఉన్నారు మేకర్స్. దీని తర్వాత హరి శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేయగా ఇప్పుడు రెండో షెడ్యూల్ ని మొదలుపెట్టడానికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు మేకర్స్.
OG Movie Shooting Update: దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ (OG) సినిమా షూటింగు ప్రస్తుతం పూణే లొకేషన్స్ లో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ ప్రస్తుతం జరుగుతున్న షూట్ లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ నాలుగు మూవీస్ సంబంధించిన షూటింగ్ ని 6 నెలల్లో కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత రాజకీయాల్లో ఫుల్ బిజీ కావాలని చూస్తున్నారట పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).
పవన్ స్పీడు చూస్తుంటే తన ఫిక్స్ చేసుకున్న ఆరు నెలల లోపలే ఈ సినిమాలకి సంబంధించిన షూటింగు పూర్తి చేస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ తర్వాత ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాడు.
Web Title: Pawan Kalyan wanted to complete all movie shooting before 6 months, Pawan Kalyan target fix for movie shootings , Pawan Kalyan Upcoming movie shooting updates, OG Movie Shooting update, ustaad bhagat singh shooting update, Hari Hara Veera Mallu Shooting Update, Pawan Kalyan New movie details,