They Call Him OG Release Date: పవన్ కళ్యాణ్ అలాగే ప్రియాంక మోహన్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా OG, ఈ సినిమాని సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో డివివి దానయ్య తర్కెక్కిస్తున్నారు. వారాహి విజయ యాత్ర ముందు వరకు సినిమా షూటింగ్ పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలని దర్శకుడు శరవేగంగా షూటింగు జరుపుతున్నారు. అయితే OG సినిమా విడుదల తేదీ ఇదేనంటూ సోషల్ మీడియాలో చక్కెరలో కొడుతున్నాయి.
They Call Him OG Release Date: ఈ సినిమా ప్రస్తుతం 40% షూటింగు కంప్లీట్ చేసుకోగా లేటెస్ట్ షెడ్యూలు హైదరాబాదులో మొదలుపెట్టారు సుజిత్ టీం.. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే మిగతా షూటింగ్ కంప్లీట్ చేయాలని సుజిత్ ఎదురుచూస్తున్నట్టు సమాచారమైతే తెలుస్తుంది. మొదటిగా ఓజీ సినిమాని డిసెంబర్ నెలలో విడుదల చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ కావడంతో.. రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
లేటెస్ట్గా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఓజీ సినిమాని వచ్చే సంవత్సరం ఏప్రిల్ లేదా జూన్ నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారంట. అలాగే ఈ సినిమాకి సంబంధించిన షూటింగు పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ కూడా డేట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏప్రిల్ 4న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాని విడుదల చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించారు మేకర్స్.

అయితే దీనికి పోటీగా పవన్ కళ్యాణ్ “ఓజీ” సినిమా వచ్చే అవకాశం ఉందా అనే డౌట్ కలుగుతుంది. ఒకవేళ ఓజీ సినిమా కనుక ఏప్రిల్ నుండి పోస్ట్ పోన్ అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భగత్ సింగ్ సినిమా కూడా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటిగా ఈ సినిమాని ఆపేద్దాం అనుకున్న తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ జరపాలి అంటూ టీం కి చెప్పినట్టు సమాచారం. కానీ హరీష్ శంకర్ సినిమా ప్రస్తుతానికి 30% కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ గురించి హరీష్ శంకర్ ప్లానింగ్ చేస్తున్నారంట.