Nithiin New Movie with Pawan title : దర్శకుడు వేణు శ్రీరామ్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ఈరోజు మొదలు పెట్టడం జరిగింది.. పవన్ నాతో హిట్ సాధించిన వేణు శ్రీరామ్ ఇప్పుడు నితిన్ సినిమాని ప్రారంభించారు. ప్రొడక్షన్లో వస్తున్న ఈ సినిమాని హైదరాబాదులో పూజా కార్యక్రమాలతో ఈరోజు మొదలుపెట్టారు. మాచర్ల నియోజకవర్గం సినిమాతో వచ్చిన నితిన్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.
వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఆల్రెడీ ఒక సినిమాని షూటింగ్ జరుపుకుంటున్నాడు. ఈ సినిమాకి గాను ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఫిక్స్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న నితిన్ సినిమాకి పవన్ కళ్యాణ్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
పవన్ కళ్యాణ్ చేసిన సూపర్ హిట్ సినిమాలలో ఒకటైన తమ్ముడు టైటిల్ ని ఈ సినిమాకి పెట్టడం విశేషం. అయితే ఈ టైటిల్ ని సినిమా మొదలుపెట్టిన రోజే నితిన్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీనితో నితిన్ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు ట్విట్టర్ లో వైరల్ గా మారాయి.
నితిన్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ తన చాలా సినిమాల్లో రెఫరెన్స్‌లను ఉపయోగించారు. నితిన్ కార్యక్రమాలకు పవన్ కూడా అతిథిగా హాజరయ్యాడు. వారి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఆ పేరుతో పవన్ సినిమా చేస్తుండడంతో పవన్ అభిమానులతో పాటు నితిన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు.