Pawan Kalyan Sujeeth OG Story: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తన ఖాతాలో ఇప్పటికే నాలుగు సినిమాలు షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసింది. వీటిని త్వరగా కంప్లీట్ చేసి రాజకీయాల్లో బిజీ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వీటిల్లో సుజిత్ దర్శకత్వంలో వస్తున్న OG సినిమా షూటింగు ఏప్రిల్ 15 నుండి మొదలవుతుందని సమాచారం, అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఏప్రిల్ లోనే మొదలు పెడుతున్నారు.
Pawan Kalyan Sujeeth OG Story: ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న OG సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ 18 సంవత్సరాల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముంబైలో అడుగు పెట్టబోతున్నారు. బాలు సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో తీసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు OG సినిమా కూడా పవన్ కళ్యాణ్ ముంబాయి గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారు.
అలాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని అంటున్నారు. సాహో సినిమా ఫ్లాప్ అవటంతో సుజిత్ (Sujeeth) రాబోయే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా మీద బాగానే కసరత్తు చేసి మళ్లీ బ్యాక్ టు ఫామ్ రావాలని ప్రయత్నాలు చేస్తున్నారంట. ప్రస్తుతానికి ఈ చిత్రానికి తాత్కాలికంగా OG అనే టైటిల్ పెట్టారు, అలాగే ఈ సినిమాలో సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లకు చాలా స్కోప్ ఉంటుంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గ్యాంగ్ స్టర్ గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. అతని మునుపటి చిత్రాలు బాలు మరియు పంజా సినిమాలు ఇదే బ్యాక్ డ్రాప్ లో వచ్చాయి. అయితే ఆ సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు కానీ, పైన చెప్పినట్లుగా సుజీత్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందిస్తాడనే గట్ ఫీలింగ్ పవన్ అభిమానుల్లో ఉంది.
Pawan Kalyan to be seen as a Mumbai gangster in Sujeeth OG, Interesting update on OG story, Pawan kalyan Sujeeth OG movie shooting date, Pawan Kalyan New movie latest news