Homeసినిమా వార్తలుబాలకృష్ణ - పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి.. నిజమేనా ?

బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి.. నిజమేనా ?

Pawan Kalyan- Balakrishna – Unstoppable 2: బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని NBK107 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీనితోపాటు బాలకృష్ణ ఆహా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ 2 (Unstoppable 2) అనే టాక్ షో కు హోస్ట్ గా చేస్తున్నారు. అయితే సీజన్ 2 వస్తున్న ఈ టాక్ షోలో మొదటి దానికంటే రెట్టింపుగా ప్రముఖుల ని అలాగే హీరోల ని తీసుకురావటానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 (Unstoppable 2) ప్రోమో ని రీసెంట్ గా విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోమో లో బాలకృష్ణ (Balakrishna) నెవర్ బిఫోర్ అవతారంగా కనిపించటం చూసాము. ఈ సీజన్ 2 ప్రారంభ ఎపిసోడ్ కు నారా చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ వస్తున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆన్ స్థాపబుల్ (Unstoppable 2) టాక్ షో కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆన్ స్థాపబుల్ సీజన్ 2 టాక్ షో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఒక ఎపిసోడ్ కు గెస్ట్ గా రానున్నట్లు సమాచారం. ఆన్ స్థాపబుల్ సీజన్ 1 పెద్ద హీరోలను అలాగే ప్రముఖులను మనం చూశాము. సీజన్ 2 లో కూడా పవన్ కళ్యాణ్ రావడం సాధ్యం అన్నట్టు ఫిలిం సర్కిల్ లో టాక్ నడుస్తుంది.

ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఒకవేళ ఇదే గనుక నిజమైతే మెగా నందమూరి ఫాన్స్ కి ఒక పండగనే చెప్పవచ్చు. దీని పై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

 

Related Articles

Telugu Articles

Movie Articles