హైదరాబాద్ వరదల నేపధ్యంలో 'గమనం' ట్రైలర్
హైదరాబాద్ వరదల నేపధ్యంలో 'గమనం' ట్రైలర్

శ్రేయ మూగపాత్రలో నటిస్తున్న వైవిధ్యమైన సినిమా గమనం. అయిదు భాషల్లో నిర్మిస్తున్న గమనం సినిమాకు సుజనరావ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి శ్రేయ లుక్ విడుదల చేసారు. అప్పటి నుంచి ఈ సినిమా మీద కాస్త ఆసక్తి పెరిగింది. ఇళయరాజా సంగీతం, బుర్రా సాయి మాధవ్ మాటలు, శ్రేయ, నిత్యా మీనన్ లాంటి టాలెంటెడ్ నటులు అనేసరికి ఈ సినిమా వైపు కాస్త దృష్టి మళ్లుతోంది.

అయితే ఈరోజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ట్రైలర్ సినిమా మీద ఆస్కక్తి పెంచేస్తోంది. మొత్తం ముగ్గురు కధలతో ఈ సినిమా తెరకెక్కించినట్టు ట్రైలర్ లో చూపారు. అందులో ఒకటి శివ కందుకూరి-ప్రియాంకా జవాల్కర్ ల కధ కాగా మరొకటి శ్రేయ కధ, మూడో కధ ఇద్దరు వీధి బాలలకు చెందినది. ఈ ముగ్గురి కధలను హైదరాబాద్ వరదలకి లింక్ చేసి దర్శకురాలు చూపిన విధానాన్ని ట్రైలర్ లో చూపారు.

ఈ మధ్య వైవిధ్యమైన సినిమా అయితేనే ప్రేక్షకులు కాస్త దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా భారీ స్టార్ కాస్ట్ సినిమాలు పక్కన పెడితే, మిగిలిన సినిమాలు అన్నీ ఇలా వైవిధ్యం మీద దృష్టి పెడుతున్నాయి. ట్రైలర్ చూడడానికి కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏమవుహ్తుందో ?