మార్చి11న పవన్ కళ్యాణ్27 ఫస్ట్‌లుక్

382
pawan-kalyan-upcoming-movie-pspk27-first-look-and-title
pawan-kalyan-upcoming-movie-pspk27-first-look-and-title

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన్నప్పటి నుంచి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన తాజా సినిమాని క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో అనేక పుకార్లు వినిపించాయి.

 

 

విరూపాక్ష, హరహర వీరమల్లు, ఓం శివమ్ వంటి అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వీటిపై క్లారిటీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మూవీ మేకర్స్ ఎట్టకేలకు సినిమా టైటిల్‌పై క్లారిటీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.

 

 

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను మహాశివరాత్రి సందర్భంగా మార్చి11 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతోఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా 17వ శతాబ్ద నేపథ్యంలో తెరకెక్కుతోంది. అంతేకాకుండా ఈ సినిమా పవన్ కెరీర్‌లో చేస్తున్న మొట్టమొదటి పిరియాడికల్ సినిమా. ఈ సినిమా కోసం పవన్ సరికొత్త లుక్స్‌లో కనిపించనున్నారు.