2022 లో Pawan Kalyan ఎన్ని సినిమాలు చేస్తున్నారో తెలుసా..?

0
42
Pawan Kalyan 2022 movies list

Pawan Kalyan Movies 2022: పవన్ కళ్యాణ్ ఈ ఏడాది వకీల్ సాబ్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అభిమానులకు సంబరాన్ని పెంచారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీలైనన్ని సినిమాలు తీయాలనే ఆలోచనలో ఉన్నారట పవన్ కళ్యాణ్. అయితే 2022 లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచి ఏకంగా బోలెడు సినిమాలు విడుదల కానున్నాయి.

Pawan Kalyan Upcoming 2022 movies list

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తో “Hari Hara Veera Mallu” మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి తను నటిస్తున్న మొదటి హిస్టారికల్ మూవీ, అంతేకాదు ఈ సినిమాతోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం ఇది. శరవేగంగా షూటింగ్ జరిపి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్.

అంతేకాకుండా సాగర్ డైరెక్షన్ లో హీరో దగ్గుపాటి రానా తో కలిసి “Ayyappanum Koshiyum”అనే రీమేక్ సినిమాలో నటించనున్నారు. చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాలో రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ జోడీగా సాయి పల్లవిని తీసుకోవాలని ప్లాన్ చేయగా డేట్స్ అడ్జస్ట్ కాక ఆమె ఓకే చేయలేదని తెలిసింది. ఈ సినిమాని 2022వ సంవత్సరంలో వినాయక చవితి పండగ సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Pawan Kalyan Up coming movies - PSPK28 - Hari Hara Veera Mallu - Rana - Surender reddy movie

హరీష్ శంకర్ డైరెక్షన్ లో “PSPK 28 “చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫ్యాన్‌ మేడ్‌ ఫస్ట్‌ లుక్‌లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. “సంచారి” ” స్టేట్‌కి ఒక్కడనే” అనే పేర్లతో ఆ లుక్‌లు టాక్‌ ఆఫ్‌ది స్టేట్‌ గా మారాయి కూడా. దీంతో ఈ మూవీ మేకర్స్‌ అఫీషల్ ఫస్ట్‌లుక్‌లు ఇవి కాదంటూ.. తామే తొందర్లో పవన్‌ లుక్‌ను రిలీజ్‌ చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ఓ క్లారిటీ కూడా ఇవ్వాల్సి వచ్చింది.

ఇక అంతే కాకుండా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడని, పవన్ కళ్యాణ్ స్నేహితుడు “రామ్ తాలూరి”ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. ఎటువంటి అడ్డంకులు రాకపోతే చిత్రాలన్నీ వచ్చే సంవత్సరం విడుదల కానున్నట్లు సమాచారం.