Homeసినిమా వార్తలుఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ పై క్రేజీ అప్డేట్..!!

ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ పై క్రేజీ అప్డేట్..!!

Pawan Kalyan, Pawan Kalyan Latest Movie story, Ustaad Bhagat Singh Story revealed, Harish Shankar, Sreeleela, Ustaad Bhagat Singh Story, Ustaad Bhagat Singh Shooting, Ustaad Bhagat Singh Glimpse, 

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అలాగే హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగు ప్రస్తుతం హైదరాబాదు లొకేషన్స్ లో జరుగుతుంది. మేకర్స్ ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది.. దీనిలో భాగంగానే ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) ఫస్ట్ గ్లిమ్స్ ని విడుదల చేశారు మేకర్స్ నిన్న. ఈ వీడియోతో సినిమాపై మరింత అంచనాలు పెంచారు.

మొదటగా ఈ సినిమా మొదలుపెట్టిన టైం లో సినిమా తేరి రీమేక్ అంటూ చాలానే ట్రోల్స్ జరిగాయి.. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో ఫాన్స్ అలాగే మూవీ లవర్స్ వద్దు ఈ సినిమా అంటూ కామెంట్ చేయడం అలాగే ట్రెండ్ చేయడం చేశారు. కానీ ఇప్పుడు విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) వీడియోతో సినిమా స్టోరీ (Story) అంత డిఫరెంట్ గా ఉంటుందని అర్థమైపోయింది అందరికీ.

అందుతున్న సమాచారం ప్రకారం హరీష్ శంకర్ ఈ సినిమా కోసం బాగానే కష్టపడినట్టు చెబుతున్నారు, తేరి రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా స్టోరీ (Story) మీద దర్శకుడు బాగా కసరత్తు చేసి ఒరిజినల్ సినిమాలోంచి 10% కావలసిన పాయింట్స్ వరకు తీసుకొని మిగతా 90% స్టోరీని ఓన్ గా రాసుకోవడం జరిగిందంట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమాల్లో భారీగానే మార్పులు అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా దర్శకుడు హరీష్ శంకర్ క్రియేట్ చేసినట్టు ఫిలింనగర్ లో టాక్ అయితే నడుస్తుంది.

Pawan Kalyan Ustaad Bhagat Singh Story revealed

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) వీడియో చూసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ కూడా అదే అభిప్రాయం వెల్లడించారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్ స్వారీ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తర్కెక్కిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ ని అందిస్తున్నారు.

Web Title: Pawan Kalyan, Pawan Kalyan Latest Movie story, Ustaad Bhagat Singh Story revealed, Harish Shankar, Sreeleela, Ustaad Bhagat Singh Story, Ustaad Bhagat Singh Shooting, Ustaad Bhagat Singh Glimpse,

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY