ఏ రాజకీయ నాయకుడు కు ఏ సినీ హీరోకు లేనటువంటి అభిమానులు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్నారు. ఇక పవన్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ కు అదే సంక్రాంతి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వకీల్ సాబ్ ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యనే రాజకీయంగాను యాక్తి వ్ అయిన పవన్ తాను నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా గురించి ప్రసంగాల రూపంలో ప్రమోషన్ చేసుకుంటున్నారు. పవన్ కం బ్యాక్ సినిమా కావడంతో ఇది రీమేక్ అయ్యినప్పటికీ కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
వ్యూస్ పరంగా పేలవమైన రెస్పాన్స్ నే అందుకున్నా లైక్స్ మరియు ట్రెండింగ్ లో మాత్రం పవన్ కెరీర్ లోనే అత్యధికంగా నిలిచింది. గత 100 గంటలకు పైగానే యూట్యూబ్ లో ఈ టీజర్ నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ వస్తుంది. అంతే కాకుండా మన టాలీవుడ్ లోనే మోస్ట్ లైక్డ్ సెకండ్ టీజర్ గా కూడా నిలిచింది. సరైన ప్లానింగ్ లేకుండానే వకీల్ సాబ్ టీజర్ ఈ ఫీట్ ను నెలకొల్పింది.
ఈ నేపథ్యంలో ఆ మధ్య విడుదలైన చిత్ర మగువా మగువా సాంగ్కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. 40 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతింది.. టీజర్ అలాగే మొదటి సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ పేరు మారుమ్రోగిపోయింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు..