pawan kalyan will again tieup with bandla ganesh

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు నిర్మాత బండ్ల గణేష్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. పవన్‌తో బండ్ల ఇప్పటికే `తీన్‌మార్`, `గబ్బర్‌సింగ్` వంటి సినిమాలను నిర్మించాడు. ఇటీవల రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించారు. వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు. కాగా ఈ మధ్యకాలంలో పవన్ భక్తుడు, ఆయన వీరాభిమాని అయిన బండ్ల గణేష్ కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ యాక్టివ్ అయిన క్రమంలో పవన్- బండ్ల గణేష్ కాంబోలో సినిమా రాబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ కూడా పవన్‌తో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. తాజాగా బండ్ల గణేష్‌ను పవన్ అభిమాని ఒకరు ఈ విషయం గురించి ప్రశ్నించారు. `మా అన్న పవన్ అన్నగారితో సినిమా ఎప్పుడు తీస్తున్నారు..` అంటూ ఓ అభిమాని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బండ్ల స్పందిస్తూ.. `నేను అదే పనిలో ఉన్నాను బ్రదర్. మన దేవుడి ఆశీస్సులు కావాల`ని రిప్లై ఇచ్చారు. అంటే పవన్‌తో సినిమా చేయడం కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చారన్న మాట. సో.. చూడాలి మరి ఈ పవన్ కళ్యాణ్ కరుణించి బండ్ల గణేష్‌కి ఏ మేర అవకాశమిస్తాడనేది!.