pawan kalyan will participate in vakeel saab shooting after festival

Pawan Kalyan: Vakeel Saab: కాస్త ఆలస్యమైనా అగ్ర కథానాయకులు ఒకొక్కరుగా చిత్రీకరణల కోసం రంగంలోకి దిగుతున్నారు. కరోనా ఉద్ధృతితో నిలిచిపోయిన సినిమాల్ని పూర్తి చేయడంపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ కూడా ఇప్పటికే తిరిగి ప్రారంభమైంది. ఈ సినిమాలో నటిస్తున్న అంజలి, నివేదా థామస్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్‌కళ్యాణ్ వంతు రావడంతో ఆయన బరిలోకి దిగనున్నారు.

పవన్‌ కల్యాణ్‌ కూడా రంగంలోకి దిగే సమయం వచ్చింది. దసరా పండగ తర్వాత ఆయన బరిలోకి దిగనున్నారు. ఈ నెల చివరి నుంచి పవన్‌ కల్యాణ్‌తోపాటు, శ్రుతిహాసన్‌లపై సన్నివేశాల్ని తీసేందుకు ఏర్పాట్లు చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి. హిందీలో సూపర్ హిట్ అయిన ‘పింక్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పవన్ న్యాయవాదిగా కనిపించనుండటం విశేషం.