Bro Movie Teaser Release Date: పవన్ కళ్యాణ్ (Pawan kalyan) అలాగే సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మొట్టమొదటిగా కలిసి నటిస్తున్న సినిమా బ్రో(Bro). సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ కి అలాగే మూవీ లవర్స్ కి భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాయి ధరంతేజ్ అలాగే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు అలాగే వీటికి సంబంధించిన అప్డేట్స్ సినిమాపై భారీగానే అంచనాలను పెంచాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ బ్రో టీజర్ (Bro Teaser) సంబంధించి నిన్న పోస్టర్ని విడుదల చేయడం జరిగింది.
Bro Movie Teaser Release Date: అయితే బ్రో టీజర్ సంబంధించిన పోస్టర్లో రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు మేకర్స్. దీనికి కారణాలు కూడా లేకపోలేదు, ఒకపక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు చేసుకుంటూ ఉన్న పవన్ కళ్యాణ్ బ్రో టీజర్ (Bro teaser) కు సంబంధించి డబ్బింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు సముద్రఖని నిన్న జనసేన పార్టీ ఆఫీస్ కి బయలుదేరినట్టు తెలుస్తుంది.
దీని తర్వాత ఈరోజు అందిన సమాచారం మేరకు దర్శకుడు సముద్రం కానీ అలాగే పవన్ కళ్యాణ్ బ్రో టీజర్ కు (Bro teaser) సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసినట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మాయ్యాయి.
అయితే రిలీజ్ డేట్ పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్ కానీ మాకు తెలుస్తున్న సమాచారం మేరకు బ్రో టీజర్ ని ఈ నెల 29న విడుదల చేస్తున్నట్టు అలాగే దీనికి సంబంధించిన ప్రకటన ఈరోజు విడుదల చేస్తారంట.

తమిళ హిట్ మూవీ వినోదయ సిత్తం కి రీమేక్ గా ఈ సినిమా వస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ కథలో సాయిధరమ్ తేజ్ తగ్గట్టుగా మార్పులు కూడా చేశారని తెలుస్తుంది. దర్శకుడు సముద్రఖని ఈ సినిమాపై చాలానే అంచనాలు పెట్టుకున్నారు అలాగే తెలుగులో దర్శకత్వం చేయటం కూడా మొదటిసారి.
ఈ మూవీ లో కేతికా శర్మ ప్రియా ప్రకాష్ వారియర్ బ్రహ్మానందం రాజా చెంబోలు తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.