లెక్చరర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

384
Pawan Kalyans Role Revealed in Harish Shankar Film
Pawan Kalyans Role Revealed in Harish Shankar Film

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్‌’లో లాయర్‌గా, క్రిష్ ‘హరిహర వీరమల్లు’ మూవీలో బందీపోటుగా కనిపించనున్నారు. ఇక హరీష్ శంకర్ తెరకెక్కించే చిత్రంలో పవన్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

గతంలో పవన్ ను గబ్బర్ సింగ్ లాంటి పవర్ ఫుల్ పాత్రలో దర్శకుడు హరీష్ తెరకెక్కించాడు. అయితే ఈసారి వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో పవన్ లెక్చరర్ పాత్రతోనే వస్తారని సమాచారం. కాగా పవన్ లెక్చరర్ పాత్ర అయినంత మాత్రాన సినిమా క్లాస్ గా ఉండే అవకాశం లేదని..

 

 

ఇందులో ఫ్లాష్‌బ్యాక్ లో పవన్ ను మాస్ కోణంలో దర్శకుడు హరీష్ చూపించబోతున్నాడని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. కాలేజీ నేపథ్యంలో ఒక బలమైన సామాజిక సమస్య నేపథ్యంలో ఈ చిత్ర కథాంశం సాగుతుందని వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పవన్ అయ్యప్పనుమ్ కోషియం, హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.