పవన్ ‘వకీల్ సాబ్’ డిజిటల్‌ రిలీజ్ డేట్

381
pawan-kalyans-vakeel-saab-movie-ott-release-date-announced
pawan-kalyans-vakeel-saab-movie-ott-release-date-announced

బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సందడి చేస్తాయి. అయితే చాలా విరామం తర్వాత రిలీజ్ కానున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలు ఇప్పటికే ఈ ఈసినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

 

 

కరోనా నేపథ్యంతో రిలీజ్ ఆలస్యం అయ్యింది. రూ. 100 కోట్ల బిజినెస్ జరిగిందని ఫిల్మ్ నగర్ టాక్.. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9 న రిలీజ్ కు రెడీ అవుతుంది.

 

 

అయితే ఇప్పుడు వకీల్ సాబ్ ఓటిటి రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ మూవీ ఓటిటి రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 15 కోట్లకు పైగా చెల్లించి డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు టాక్.

 

 

అంటే సినిమా రిలీజైన 50 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమ్ లో వకీల్ సాబ్ ప్రసారం కానున్నది. అంటే సినిమా ఏప్రిల్ 9 న రిలీజైతే 50 రోజుల తర్వాత అంటే మే లాస్ట్ వీక్ లో అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి రానున్నది. మే 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో వకీల్ సాబ్ స్ట్రీమింగ్ కానుందిన తెలుస్తోంది. మరోవైపు జీ సినిమాస్ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. దీనికోసం కూడా 15 కోట్ల వకు పెట్టినట్లు తెలుస్తుంది.

 

 

ఇప్పటికే విడుదలైన టీజర్.. పోస్టర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.