‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

0
373
Pawan Kalyan's Vakeel Saab release date locked

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ ఖరారైంది. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ ఫ్యాన్స్ ఖుషీ చేసుకునే టైమొచ్చింది..కరోనా వైరస్ కారణంగా 2020లో ఎన్నో రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమను ఈ మహమ్మారి కోలేకోలేని దెబ్బతీసింది. ఈ నేపథ్యంలోనే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ని 2020లో వెండితెరపై చూద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు సైతం నిరాశ చెందారు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న `వకీల్‌ సాబ్` సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి.

ఈ తర్వాత కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తిరిగి ప్రారంభమైన షూటింగ్ మంగళవారంతో ముగిసింది. దీంతో యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది.ముందుగా ‘వ‌కీల్‌సాబ్‌’ సంక్రాంతికి వ‌స్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ‘వ‌కీల్‌సాబ్’ విడుద‌లపై ఇప్ప‌టికే నిర్మాత‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ట‌. ఏప్రిల్ 9న ‘వ‌కీల్‌సాబ్’ సంద‌డి థియేట‌ర్స్‌లో ఉంటుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల‌కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న‌ను నిర్మాత‌లు ప్ర‌క‌టిస్తారు.

అయితే దీనిపై యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ‘వకీల్ సాబ్’ టీజర్‌ రిలీజ్ చేయనున్నారు. అప్పుడే రిలీజ్ డేట్‌ను అఫిషియల్‌గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. బాలీవుడ్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘పింక్‌’ సినిమాకు ఇది రీమేక్‌. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో అంజ‌లి, నివేదా థామ‌స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

 

Previous articleNidhhi Agerwal Latest Photo Shoot Pics
Next article‘అఖిల్ 5వ’ సినిమాకు హీరోయిన్ ఫిక్స్..!