Payal Rajput Next movie Anaganaga O Athidhi' Aha OTT premieres November 20

ట్రెండ్ లౌడ్ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప‌త‌కాం పై టాలెంటెడ్ బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ ముఖ్య పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం అన‌గ‌న‌గా ఓ అతిధి. ఈ సినిమాలో పాయ‌ల్ తో పాటు యువ క‌థనాయ‌కుడు చైత‌న్య కృష్ణ, న‌టులు ఆనంద్ చ‌క్ర‌పాణి, వీణ సుంద‌ర్ త‌దిత‌ర‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ద‌యాల్ ప‌ద్మనాభ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఈ చిత్రాన్ని రాజా రామ్ మూర్తి, చిదంబ‌రం న‌టీస‌న్ నిర్మించారు. అనుకోని ప‌రిస్థితుల్లో ఓ అర్ధ‌రాత్రి ఓ ఇంటికి వ‌చ్చిన అతిధి కార‌ణంగా ఎదురైయ్యే స‌మ‌స్య‌లు క‌థాంశంగా ఈ సినిమాను ద‌ర్శ‌కుడు ద‌యాల్ అత్యంత ఉత్కంఠ క‌లిగేలా రూపొందిచారు. ఆరెక్స్ 100 వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్, ఆర్ డి ఎక్స్ ల‌వ్, డిస్కోరాజా సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ సోంత‌ ఇమేజ్ తెచ్చుకున్న పాయల్ ఇప్పుడు అన‌గ‌న‌గా ఓ అతిధితో మ‌రోసారి ఆడియెన్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి రెడీ అవుతుంది.

ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ స్లేట్ లో ప్ర‌ముఖ తెలుగు ఓటిటి ఆహాలో నవంబ‌ర్ 20న విడుద‌ల అవుతుంది.
న‌టీన‌టులు – పాయ‌ల్ రాజ్ పుత్, చైత‌న్య కృష్ణ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, వీణ సుంద‌ర్
ద‌ర్శ‌కుడు – దాయల్ ప‌ద్మనాభ‌న్
ప్రొడ‌క్ష‌న్ హౌస్ – ట్రెండ్ లౌడ్ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రాఫ‌ర్ – రాకేష్ బి
ప్రొడ్యూస‌ర్స్ – రాజా రామామూర్తి, చింద‌బ‌ర్ న‌టీశ‌న్
మ్యూజిక్ డైరెక్ట‌ర్ – ఆరోల్ కోరెల్లి
రైట‌ర్ – కాశీ న‌దీంప‌ల్లి