సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ చేతుల మీదుగా ‘పెళ్లి సంద‌D’ ట్రైల‌ర్ విడుద‌ల‌

0
247
Pelli Sandadi Movie Trailer Launched By Super Star Mahesh Babu

Pelli Sandadi Trailer: ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల‌వువుత‌న్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ విడుద‌ల చేశారు. ‘‘వెండితెర‌పై న‌టుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ‘పెళ్లి సంద‌D’ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ఆయ‌న‌కు, ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అంటూ మహేశ్ టీమ్‌ను అభినందించారు.

‘పెళ్లి సంద‌D’ మూవీని రాఘ‌వేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు

ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే .. హీరో, హీరోయిన్ ఇత‌ర చిత్ర యూనిట్ స‌భ్యులంద‌రూ పెళ్లిలో చేసే హ‌డావుడితో సంద‌డిగా ఉండే స‌న్నివేశాల‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది.

Pelli Sandadi Movie Trailer Launched By Super Star Mahesh Babu

త‌నికెళ్ల‌భ‌ర‌ణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, రావు ర‌మేశ్‌, ష‌క‌ల‌క శంక‌ర్ అండ్ టీమ్ స‌ర‌దాగా ఉండే స‌న్నివేశాలు, హీరో రోషన్‌, హీరోయిన్ శ్రీలీల‌ మ‌ధ్య సాగే అల్ల‌రి ప‌నులు, రొమాంటిక్ స‌న్నివేశాలతో పాటు మా ఫ్యామిలీ అంతా నీ ఫ్యాన్సేమే మా తాత పేరు నాగేశ్వ‌ర్‌రావు, నాన్న పేరు నాగ‌భూష‌ణం, మా అబ్బాయి పేరు నాగ‌చైత‌న్య అంటూ రాజేంద్ర‌ప్ర‌సాద్ నాగుపాముతో చేసే కామెడీ, వెన్నెల‌కిషోర్‌-ష‌క‌ల‌క శంక‌ర్ మ‌ధ్య సాగే స‌ర‌దా స‌న్నివేశాల‌తో సాగే ట్రైల‌ర్ సినిమా ఎంత క‌ల‌ర్‌ఫుల్‌గా, ఎంట‌ర్‌టైనింగ్‌ ఉంటుందో చెప్ప‌క‌నే చెబుతుంది.

మ‌రోవైపు హీరోయిన్ క‌న‌ప‌డ‌కుండా పోయిన‌ప్పుడు ఎమోష‌న‌ల్‌గా వెతికే హీరో, హీరోయిన్ తండ్రి ప్ర‌కాశ్‌రాజ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ హీరో రోష‌న్ చేసే యాక్ష‌న్… వ‌దిలించుకోవ‌డానికి నేనేమైనా హోలీకంటిన రంగునా..హోల్ సేల్ అల్లుడ్ని అంటూ రోష‌న్ చెప్పే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌, గుడిలో విల‌న్స్‌ను చిత‌కొట్టే ఫైట్ ఇవ‌న్నీ సినిమాలో యాక్ష‌న్‌, ఎమోష‌న‌ల్ యాంగిల్స్‌ను ఎలివేట్ చేస్తున్నాయి. ట్రైల‌ర్ చివ‌ర‌లో ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్రరావు క‌నిపించడం కొస‌మెరుపు.

Also Read: మ‌హేశ్ బాబు ‘స‌ర్కారువారి పాట‌’ గోవా షెడ్యూల్ ప్రారంభం 

 

Previous articleActress Shalini Pandey Latest Stills
Next articleప్రభాస్- పూజా హెగ్డే మధ్య విభేదాలు..?