Homeసినిమా వార్తలురొమాన్స్ తో కట్టిపడేస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టైటిల్ సాంగ్ రిలీజ్!

రొమాన్స్ తో కట్టిపడేస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టైటిల్ సాంగ్ రిలీజ్!

The Title Song Of Naga Shaurya And Malavika Nair's Phalana Abbayi Phalana Ammayi now. The film all set to release on March 17th. which is directed by Srinivas Avasarala.

Phalana Abbayi Phalana Ammayi Title Song: ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి మ్యాజికల్ ఫిలిమ్స్ తర్వాత నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ‘కనుల చాటు మేఘమా’ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు.

Phalana Abbayi Phalana Ammayi Title Song: శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన మొదటి రెండు సినిమాలు ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’కు సంగీతం అందించిన కళ్యాణి మాలిక్ ముచ్చటగా మూడో చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సోమవారం సాయంత్రం రెండో పాటగా విడుదలైన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టైటిల్ సాంగ్  మెప్పిస్తోంది.

లిరికల్ వీడియోలో నాయకా నాయికల కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి పాత్రల తీరు, వారి పరిచయం కాస్త భిన్నం అని తెలిపేలా.. వీడియో ప్రారంభంలో ఓ వైపు నాయకా నాయికలు వర్షంలో తడుస్తూ ఉండటం, మరోవైపు ఆకాశంలో సూర్యుడు కనిపించడం ఆసక్తికరంగా ఉంది.

అప్పట్లో వంశీ-ఇళయరాజా కాంబినేషన్ కి ఎంతటి క్రేజ్ ఉందో.. ఇప్పుడు కేవలం రెండు చిత్రాలతోనే శ్రీనివాస్ అవసరాల-కళ్యాణి మాలిక్ కాంబినేషన్ కూడా అలాంటి ప్రత్యేక క్రేజ్ ను సొంతం చేసుకోవడం విశేషం. వీరి కలయికలో వచ్చిన సినిమాల్లోని మెలోడీలు ఎంతో ఆహ్లాదకరంగా, ఓ కొత్త లోకంలో విహరింపజేసే అంత హాయిగా ఉంటాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది.

ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలో నాగశౌర్యకు జోడిగా నటించి వెండితెరపై మ్యాజిక్ చేసిన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. నాయకనాయికల పదేళ్ల జీవిత ప్రయాణాన్ని ఏడు దశల్లో సహజంగా చూపించనున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY