PM Modi condolences on Jaya Prakash Reddy Death: తనదైన ప్రత్యేక నటనా శైలితో జయప్రకాష్ రెడ్డి అందరినీ ఆకట్టుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్లో పేర్కొన్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ప్రముఖ సినీ, రంగస్థల నటుడు జయప్రకాష్ రెడ్డి మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. జయప్రకాష్ రెడ్డి తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారని ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం. ‘‘జయప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి’’ అని ప్రధాని తన ట్వీట్లో పేర్కొన్నారు.
జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.
— Narendra Modi (@narendramodi) September 8, 2020
మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో తన నివాసంలోని బాత్రూమ్లోనే జయప్రకాష్ రెడ్డి కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కరోనా కారణంగా సిసిమా షూటింగ్లు నిలిచిపోవడంతో గత కొద్ది నెలలుగా ఆయన గుంటూలో ఉంటున్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కరోనా కారణంగా సిసిమా షూటింగ్లు నిలిచిపోవడంతో గత కొద్ది నెలలుగా ఆయన గుంటూలో ఉంటున్నారు.