Police Case On Dimple Hayathi:టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న డింపుల్ హయాతి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. విజయవాడకు చెందిన ఈ అమ్మాయి గల్ఫ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా విడుదలైన విషయం ఎవరికీ తెలియని కూడా తెలియదు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న డింపుల్ హయాతి మీద జూబ్లీహిల్స్ హైదరాబాదులో పోలీస్ కేస్ (Police Case) నమోదు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Police Case On Dimple Hayathi: డింపుల్ హయాతి అందచందాలతో వరుస సినిమా ఆఫర్లు అలాగే సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. హరి శంకర్ దర్శకత్వం వహించిన గద్దలకండ గణేష్ అనే సినిమాతో వెలుగులోకి వచ్చిన డింపుల్ హయాతి ప్రస్తుతం హైదరాబాదులో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంది. అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న పోలీస్ అధికారి తో పలుసార్లు గొడవ జరగటంతో ఈ కేసు నమోదు అయినట్టు తెలుస్తుంది.
ఇక వివరాల్లోకి వెళితే, డింపుల్ హయాతి (Dimple Hayathi) ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో తమ కాబోయే భర్త డేవిడ్ తో ఉంటుంది. అదే అపార్ట్మెంట్స్ లో ఐపీఎస్ అధికారి గా పని చేస్తున్న రాహుల్ హెగ్డే ఆఫీసర్ కూడా నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ గొడవ అంతా కార్ పార్కింగ్ వద్ద వచ్చిందని సమాచారం. ఈ క్రమంలో డింపుల్ సంయమనం కోల్పోయి ఐపిఎస్ అధికారి వాహనంపై దాడి చేసి కాలితో పదే పదే కొట్టడం, ఆయన్ని దూషించడం వంటి చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.



పలుసార్లు డింపుల్ తన కారుతో ఐపీఎస్ అధికారి కారుని ఢీ కొట్టిందని తను ఎన్నిసార్లు నచ్చ చెప్పటానికి ప్రయత్నించిన వినలేదంటూ.. అలాగే రీసెంట్గా తన కాబోయే భర్త డేవిడ్ కూడా ఐపీఎస్ అధికారి కారుని ఢీకొట్టడంతో ఈ సమస్య గొడవగా మారి పెద్దదైందంట. దీనితో ఐపీఎస్ రాహుల్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కూడా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్‌పై 353, 341, 279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు….ఈ విషయంలో డింపుల్, డేవిడ్ లను హెచ్చరించి నోటీసులు ఇచ్చారని తెలుస్తుంది.