police complaint on allu arjun for visit kuntala water falls

Allu Arjun Pushpa : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్‌తో పాటు పుష్ప సినిమా నిర్మాణ బృంద సభ్యులుపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా నిబంధనలు పాటించకుండా ఎలా సందర్శిస్తారంటూ ప్రశ్నించారు.

సినీ హీరో అల్లు అర్జున్‌‌పై సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఆయన కరోనా నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పుష్ప టీమ్ ఇటీవల ఆదిలాబాద్ ఫారెస్ట్‌లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ పుష్ప టీమ్ కుంటాల జలపాతాన్ని, తిప్పేశ్వర్‌ ఆలయాన్ని సందర్శించారు.

కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినా అల్లు అర్జున్‌ సహా పుష్ప సినిమా నిర్మాణ బృంద సభ్యులు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ జలపాతాన్ని సందర్శించడంతోపాటు, తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండా చిత్రీకరణ చేశారన్నారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్‌రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ తర్వాత కేసు నమోదు చేస్తామని తెలిపారు.

రంగస్ధలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్పలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో కనబడుతూ.. లారీ డ్రైవర్‌గా అదరగొడుతాడని తెలుస్తోంది. తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. రష్మిక మందన హీరోయిన్‌గా చేస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది.