సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్‌.!

0
174
Police Investigate Behind Story Sai Dharam Tej Bike Accident

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ రోడ్డు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. రోడ్డు ప్రమాదం పై పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి? దెబ్బల తీవ్రత ఏస్థాయిలో ఉందో ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాం. సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్తున్నారు.

కాలర్ బోన్ విరిగిందనీ.. అయినా కంగారు పడాల్సిన పని లేదని అన్నారు. ముందు జాగ్రత్తగా తాము ఐసీయూకు తరలించామనీ.. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు. తేజ్.. తల, వెన్నుముకలకు తీవ్ర గాయాలేవీ కాలేదనీ.. వచ్చే 24 గంటల్లో మళ్లీ పరీక్షలు చేస్తామని అన్నారు అపోలో డాక్టర్లు. తేజ్‌కు కుడికన్ను, ఛాతి, పొట్ట, కాలివేలి భాగంలో తీవ్రగాయాలయ్యాయి. కొన్ని టెస్టులు చేసి కాలర్‌బోన్‌ విరిగినట్లు తెలిపారు.

ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు అనే దానిపై విచారణ ప్రారంభించారు. తేజ్ ఇంటి దగ్గర్నుంచి నరేష్ ఇంటికి వెళ్ళిన దానిపై ఆరా తీస్తున్నారు. నరేష్ ఇంటి దగ్గర్నుంచి అతని కొడుకుతో కలిసి తేజ్ బయటికి వెళ్లినట్లు తెలుస్తోంది. బైక్ రేసింగ్ పాల్పడ్డారన్న అనుమానాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Police Investigate Behind Story Sai Dharam Tej Bike Accident

నరేష్ మాట్లాడుతూ బైక్‌ రైడింగ్‌పై సాయి ధరమ్‌ తేజ్‌ని హెచ్చరించానని, చాలా సార్లు రైడింగ్‌ వద్దని చెప్పానని అన్నారు. సాయి ధరమ్ తేజ్‌ యాక్సిడెంట్ కు ముందు తన ఇంటి నుంచే బయల్దేరాడని తెలిపారు. ఇప్పటికే తేజ్ పై ర్యాష్ డ్రైవింగ్, ఫాస్ట్ గా డ్రైవ్ చేయడంపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రయాణానికి ముందు తేజ్ తీసుకున్న ఫుడ్ ఏంటీ.. ఆ సమయంలో ఏమైనా ఒత్తిడికి గురయ్యారా.. లేక ఇంకేమైనా కారణలు ఉన్నాయా అనే కోణంలో పోలీసు దర్యాప్తు జరుగుతోంది.

 

Previous article‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ మరోసారి వాయిదా!
Next articleNithiin In A Political Thriller Macherla Niyojakavargam First Look