PS2 Movie Review In Telugu: ప్రముఖ డైరెక్టర్ మణి రత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ రెండవ భాగం ఈ రోజు విడుదల అయింది. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’అనే నవల ఆధారంగా తెరకెక్కించిన చోళ రాజుల హిస్టారికల్ మూవీ ఇది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించారు అందులో మొదటి భాగం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో విడుదలై తమిళ్లో మంచి సక్సెస్ సాధించింది. ఈరోజు రెండవ భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది. అయితే కొన్ని అంశాలు కథ ఏంటి ? ఎలా ఉంది ? అనే విషయం ట్విట్టర్ వేదిక ద్వారా హాట్ డిస్కషన్ గా మారింది.
Ponniyin Selvan 2 Review: మొదటి భాగం కంటే కూడా రెండవ భాగం స్టోరీ బాగుంది అన్న టాక్ వస్తుంది. పార్ట్ వన్ లో స్టోరీ కాస్త స్లోగా సాగినప్పటికీ పార్ట్ టూ లో మాత్రమే స్టొరీ మంచి ఊపులో ఉందట. అలాగే మూవీలో హై వోల్టేజ్ డ్రామా తో పాటు మంచి పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మరి ఆ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Ponniyin Selvan 2 Telugu Movie Review & Rating: 2.75/5
నటీనటులు : విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, పార్తీబన్, ప్రభు, జయరామ్, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్, రెహమాన్, లాల్, నాజర్, కిశోర్ తదితరులు
కథ : కల్కి కృష్ణమూర్తి ‘పొన్నియిన్ సెల్వన్’ నవల
ఛాయాగ్రహణం : రవి వర్మన్
సంగీతం: ఏఆర్ రెహమాన్
తెలుగులో విడుదల : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (‘దిల్’ రాజు)
నిర్మాతలు : మణిరత్నం, సుభాస్కరన్
దర్శకత్వం : మణిరత్నం
కథ : మొదటి భాగం పోనియన్ సెల్వన్ (జయం రవి) చోళనాడుకు నౌకపై, అతనిపై దాడి జరగడం, తర్వాత అతను నీటిలో మునగడం, సడన్గా ఒక ముసలావిడ అతన్ని రక్షించడానికి రావడం తో ఎండ్ అవుతుంది. ఇక రెండవ భాగం మొదటి భాగం ముగిసిన దగ్గర నుంచి కాకుండా అసలు ఆదిత్య కరికాళుడుకు మరియు నందిని కి మధ్య ఉన్న చిన్ననాటి ప్రేమ కథ నుంచి మొదలవుతుంది.
వీరిద్దరి ఫ్లాష్ బ్యాక్ పూర్తి అయిన తరువాత నీళ్లలో మునిగిన వందియ దేవుడు మరియు పొన్నియిన్ సెల్వన్‌లను పూంగుళి కాపాడుతుంది. మరోపక్క ఆదిత్య కరికాళుడు , కుందవై మరియు పొన్నియిన్ సెల్వన్‌లను చంపడానికి నందిని పాండ్యులతో కలిసి పథకం వేస్తుంది. అసలు నందినికి వీరిపై ఇంత పగ ఎందుకు? నందిని వేసిన పథకం సఫలం అవుతుందా? చివరికి చోళ నాడులో రాజు ఎవరు? అనేది తెలియాలంటే స్క్రీన్ పై మూవీ చూడాల్సిందే.
పాత్రలు మరియు సాంకేతిక సిబ్బంది: నటీనటులను పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో యాక్షన్ కి ముఖ్యంగా స్కోప్ ఉన్న పాత్రలు రెండే రెండు ఒకటి ఆదిత్య కరికాళుడు మరియు నందిని. ఇద్దరూ తమ పాత్రలకు ఎంతో న్యాయం చేశారని చెప్పవచ్చు. ఐశ్వర్యారాయ్ పర్ఫామెన్స్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అనడంలో ఆశ్చర్యం లేదు. తాను చేసిన రెండు పాత్రలకు నూరు శాతం ప్రాణం పోసింది ఆమె.
ఐశ్వర్యారాయ్ తరువాత తిరిగి అంతగా ప్రేక్షకులను మెప్పించగలిగింది విక్రమ్ పాత్ర. ఆ పాత్రలో అతను పరికించిన ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇటు కార్తీ కూడా రెండవ భాగంలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. కానీ ఇందులో కార్తీ నుంచి ఎక్కువ కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఈ భాగంలో అతని క్యారెక్టర్ కి ఎక్కువ ఎమోషనల్ టచ్ చేసి ఉంది. త్రిష తన క్యారెక్టర్ కి బాగా సెట్ అయింది.

టెక్నాలజీ పరంగా కూడా ఈ సినిమా హైలెట్ అని చెప్పవచ్చు. టెక్నికల్ సిబ్బంది చోళుల కథను భారీ స్థాయిలో అందించడంలో సఫలమయ్యారు. మొదటి భాగం కంటే కూడా రెండవ భాగంలో కథ పైన, క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్స్ పైన డైరెక్టర్ బాగా కాన్సెంట్రేట్ చేసినట్లు తెలుస్తోంది. ఎడిటింగ్ విషయానికొస్తే పర్వాలేదు అని చెప్పవచ్చు. సినిమాలో కాస్త ఎక్స్ట్రా అనిపించిన మరికొన్ని సీన్లను తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మరో హైలెట్. ప్రొడక్షన్ వాల్యూస్ మరియు సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉన్నాయి.
విశ్లేషణ: మొదటినుంచి అనుకుంటున్నట్లు గాని మొదటి భాగం కంటే కూడా రెండవ భాగంలో ఎమోషన్స్ మరియు కథ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా విక్రమ్ మరియు ఐశ్వర్య రాయి మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. చిత్రంలోని ప్రతి సన్నివేశం చోళ రాజుల కీర్తి కి తగినట్లు గాని భారీ హంగులతో కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా వచ్చే ట్విస్టులు బాగా ఎంటర్టైన్ చేస్తాయి.
కాకపోతే ఇంకా కొన్ని ప్రశ్నలు ప్రశ్నలు గానే మిగిలాయి అన్న సందేహం కలుగుతుంది. చాలా పెద్ద కథను కేవలం రెండు భాగాలకు కుదించడం వల్ల సినిమాలో ఎమోషన్స్ వర్క్ అయినప్పటికీ పాత్రల మధ్య ఇంకా కొంత క్లారిఫికేషన్ లోపించింది. అసలు ఆదిత్య కరికాలను యుక్త వయసులో ఎందుకు దూరమయ్యాడు? మందాకిని మరియు సుందర చోళుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలపై స్పష్టత లేదు. అంతేకాకుండా అక్కడక్కడ స్టోరీ కాస్త సాగదీతగా స్లోగా అనిపిస్తుంది.
సినిమా లెంతీగా ఉండడం కూడా ఓ మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు.
తీర్పు: మణిరత్నం భారీ డ్రీం ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ అర్థవంతంగా అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ లెంత్ కాస్త ఎక్కువ మరియు కొన్ని సన్నివేశాలు సాగదీతగా బోరింగ్ గా ఉన్నాయి. కానీ మంచి పర్ఫామెన్స్ తో కూడిన ఓ గ్రాండ్ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది. మీకు పిరియాడిక్ డ్రామా ఇష్టమైతే కచ్చితంగా ఈ చిత్రాన్ని చూడవచ్చు.