Ponniyin Selvan Telugu Movie Review:
రేటింగ్ : 2.5/5
నటీనటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభు, ఆర్. శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, ఆర్. పార్తిబన్
దర్శకత్వం : మణిరత్నం
నిర్మాత: మణిరత్నం, సుభాస్కరన్ అల్లిరాజా
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
Ponniyin Selvan Review: మణిరత్నం దర్శకత్వం లో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా పొన్నియన్ సెల్వన్. భారీ తారాగణంతో నిర్వహించిన ఐశ్వర్య రాయ్, త్రిష కృష్ణన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం పార్ట్-1 ఈ రోజు విడుదల చేయడం జరిగింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
Ponniyin Selvan Story: చోళ రాజ్యాన్ని హస్త గతం చేసుకోవడానికి ఆ కుటుంబంలోని ఆ రాజు అన్నయ్య కుమారుడే కుట్రలు పన్నుతాడు. మరో వైపు చోళ రాజ్య యువరాజు ఆదిత్య (విక్రమ్) గతంలో పాండ్య రాజును చంపినందుకు ఐశ్వర్య రాయ్ (నందిని) కుట్రలు పన్నుతూ.. చోళ రాజ్యం నాశనానికి పునాదులు తవ్వుతూ ఉంటుంది.
ఈలోపు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని అరుణ్మొళిని బంధించి తీసుకురావడానికి అతడి తండ్రే సైన్యాన్ని పంపే పరిస్థితి వస్తుంది. మరోవైపు చోళ రాజులకు తమ రాజ్యాన్ని కోల్పోయిన పాండ్య రాజులు అరుణ్మొళిని అంతమొందించడానికి పన్నాగం పన్నుతారు. మరి ఈ దాడుల నుంచి అరుణ్మొళి తప్పించుకున్నాడా.. వల్లవరాయుడు అతణ్ని కాపాడగలిగాడా.. చోళ రాజులకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర ఎంత మేరకు ఫలించింది అన్న విషయాలు తెర మీదే చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
మెయిన్ క్యారెక్టర్స్ యాక్టింగ్
కథ
మ్యూజిక్
విజువల్స్
మైనస్ పాయింట్స్:
లెంత్
నెమ్మదిగా సాగే కథనం


సాంకేతిక విభాగం : ముందే చెప్పుకున్నట్లు స్రిప్ట్ లో తప్ప, టేకింగ్ అండ్ మేకింగ్ పరంగా సినిమా బాగుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి క్రాఫ్ట్ లో డెప్త్ ఉంది. అందుకే సాంకేతికంగా పెద్దగా ఎక్కడా లోపాలు కనిపించవు. వీ.ఎఫ్.ఎక్స్ దగ్గర నుంచీ కెమెరా వర్క్, నేపథ్య సంగీతం వరకూ ప్రతి క్రాఫ్ట్ వర్క్ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు అద్భుతం.
విశ్లేషణ & తీర్పు : ఈ చిత్రంలోని నటీనటుల ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. చోళ రాజ్యపు యువరాజుగా విక్రమ్, పగతో రగిలిపోయే నందిని పాత్రలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, గొప్ప వీరుడిగా జయం రవి అధ్భుతంగా నటించారు. అయితే, ఈ మొదటి పార్ట్ ను నడిపిన ప్రధాన పాత్ర మాత్రం కార్తీ దే. తన పాత్రలో కార్తీ చాలా బాగా నటించాడు.
మణిరత్నం ల్యాగ్ సీన్స్ కూడా కాస్త ఇబ్బంది పెడతాయి. నిజానికి ఆర్టిస్ట్ ల పరంగా చూసుకుంటే సినిమా మీద ప్రేక్షకుడికి ప్రతి ఇరవై నిమిషాలకు ఇంట్రెస్ట్ పుట్టించే స్కోప్ ఉంది. అయినప్పటికీ దర్శకుడు మాత్రం.. అవన్నీ వదిలేసి, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపేశాడు.
సముద్రంలో ఒక భారీ యాక్షన్ ఘట్టంతో సినిమాను ముగించడం వల్ల ప్రేక్షకుల్లో కొంచెం కదలిక వస్తుంది కానీ.. లేదంటే ‘పొన్నియన్ సెల్వన్’ పరిస్థితి ఘోరంగా ఉండేదే. కథను మధ్యలో ముగించి.. సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూడమని చెప్పారు కానీ.. దాన్ని చూడాలన్న కుతూహలం అయితే పార్ట్-1 కలిగించలేదు. సినిమాలో బలహీనమైన పాత్రలు కూడా ఎక్కువగా ఉండటం.. ఆ పాత్రల తాలూకు సన్నివేశాలు కూడా ఉత్కంఠ కలిగించలేకపోయాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకోలేక పోయింది.