Homeసినిమా వార్తలుPooja Hegde: రాధేశ్యామ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పూజ హెగ్డే..!

Pooja Hegde: రాధేశ్యామ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పూజ హెగ్డే..!

Pooja Hegde: Radhe Shyam: రెబెల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ లవ్ స్టోరీ రాధే శ్యామ్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ గత కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పది రోజులు జరిపితే పూర్తవుతుందని పూజా హెగ్డే తెలిపారు.

తన పాత్ర గురించి పూజా మాట్లాడుతూ- ”ఈ సినిమాలో ప్రేరణగా కనిపిస్తాను. ప్రస్తుతం ప్రేరణ గురించి ఎక్కువగా చెప్పలేను. ‘రాధేశ్యామ్‌’ రిలీజ్‌ సమయంలో ప్రేరణ గురించి ఎక్కువగా మాట్లాడతాను. ఇటీవలి కాలంలో నేను చేస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం ఇది. అలాగే కొన్ని యాక్షన్‌ సినిమాల తర్వాత ప్రభాస్‌ ఈ రొమాంటిక్‌ మూవీ చేస్తున్నారు. అందుకే నాకీ సినిమా స్పెషల్‌” అన్నారు.

యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతోపాటు చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’లో కీలక పాత్రలో నటిస్తుంది ఈ బుట్టబొమ్మ. ఇందులో రామ్‌ చరణ్‌ సరసన కనిపించనుంది.

 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY