pooja hegde demanding shocking remuneration for up coming movies
pooja hegde demanding shocking remuneration for up coming movies

ప్రస్తుతం టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఖాతాలో వరుసగా ‘అరవింద సమేత, మహర్షి’ తాజాగా ‘గద్దలకొండ గణేష్’ లాంటి భారీ విజయాలున్నాయి. దీంతో ఆమెకు డిమాండ్ బాగా పెరిగింది. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకునే హీరోలంతా పూజా వైపే చూస్తున్నారు. దీంతో పూజా రెమ్యూనరేషన్ రెట్టింపు చేసినట్టు తెలుస్తోంది. సుమారు రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట.

మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను పూజా పక్కాగా ఫాలో అవుతోందన్నమాట. ఇకపోతే ప్రస్తుతం ఆమె చేతిలో ప్రభాస్ చేస్తున్న ‘జాన్’, అల్లు అర్జున్ యొక్క ‘అల వైకుంఠపురంలో’, అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ చిత్రాలున్నాయి. ఇవి గనుక హిట్టైతే రూ.2 కోట్లు కాస్త రూ.3 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమైనా ఈ మధ్య పూజా హెగ్డే రెమ్యూనరేషన్ గురించి తరుచూ వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ వార్తలు ఆమె కెరీర్ కి పాడు చేసేవే.