‘రాధేశ్యామ్‌’ కి డబ్బింగ్‌ స్టార్ట్‌ చేసిన పూజా హెగ్డే

0
201
pooja-hegde-dubs-for-prabhas-radhe-shyam-teaser
pooja-hegde-dubs-for-prabhas-radhe-shyam-teaser

ప్రేమికుల రోజు కానుకగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా ‘రాధేశ్యామ్’ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్ రాబోతుందని మేకర్స్ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పూజా హెగ్డే ఈ సినిమా టీజర్‌ కోసం డబ్బింగ్‌ చెబుతున్న విషయాన్ని ట్వీట్‌ చేసింది. డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోని షేర్ చేస్తూ.. ఉదయాన్నే ‘రాధేశ్యామ్‌’చిత్ర టీజర్‌ కోసం డబ్బింగ్‌ స్టార్ట్‌ చేశాను, ఫిబ్రవరి 14న టీజర్‌తో వచ్చేస్తున్నాం..’ అంటూ పూజా తన ట్వీట్‌లో తెలిపింది.

 

 

 

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఫీల్ గుడ్ ప్రేమకథా చిత్రంగా ‘రాధేశ్యామ్‌’ రూపొందుతోంది. డార్లింగ్ ప్రభాస్ పూర్తి లవ్ స్టోరీలో నటించి చాలారోజులే అయింది. ఇందులో ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ రోల్‌ పోషిస్తున్నారట. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.