Pooja Hegde, High Remuneration, Varun Tej ,Valmiki Movie, Telugu Movie News
Pooja Hegde, High Remuneration, Varun Tej ,Valmiki Movie, Telugu Movie News

వాయిస్ 1:టాలీవుడ్ లో ఫుల్ ప్లెడ్జెడ్ గా ఉండే కథానాయికలు తక్కువమందే ఉంటారు.సీజనల్ హీరోయిన్స్ మాత్రం చాలా మంది కనిపిస్తుంటారు.అలా ఇప్పడున్న వాళ్లలో పూజా హెగ్డే కూడా సీజనల్ హీరోయిన్ మాత్రమే.ఎందుకంటే ఆమె యాక్టింగ్ స్కిల్స్ అంతతమాత్రమే అని గతంలో వచ్చిన సినిమాలు నిరూపించాయి.క్రేజ్ వల్ల ఆమె అడిగినంత ఇచ్చి మరీ సినిమాలు చేయించుకుంటున్నారు.ఇప్పటికే ఎన్టీఆర్ నుండి మహేష్ బాబు వరకు అందరు స్టార్ హీరోస్ ని కవర్ చేసిన ఆమె అప్ కమింగ్ మూవీస్ కి రెమ్యునరేషన్ విషయంలో చుక్కలు చూపిస్తుంది.

ఆమె ఉంటే సినిమాకి క్రేజ్ వస్తుంది,బిజినెస్ విషయంలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుండడంతో ప్రొడ్యూసర్స్ కూడా కాస్త కళ్ళు తిరిగినా కూడా తేరుకుని అడిగినంత ఇస్తున్నారు.వాల్మీకి సినిమాకి అయితే పూజా హెగ్డే ని ఫైనల్ చేసాడు టాలీవుడ్ లో ఆమెకి బిగ్ బ్రేక్ ఇచ్చిన హరీష్ శంకర్.అయితే ఆమె మాత్రం 15 రోజులకు రెండు కోట్లు డిమాండ్ చేసింది.ఎంత బేరాలాడినా పాతిక లక్షలకి మించి డిస్కౌంట్ ఉండదు కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా పైకి నవ్వుకుంటూ అగ్రిమెంట్ సైన్ చేసారు.ఇంతకుముందు ముకుందా లో కూడ వరుణ్ అండ్ పూజా హెగ్డే కలిసి నటించారు.మళ్ళీ ఇన్నాళ్లకు కాంబో రిపీట్ అవుతుంది.

ఒక్క పూజా హెగ్డే మాత్రమే కాదు గతంలో ఎవడు సినిమాలో పది రోజుల కాల్ షీట్స్ కోసం కోటి రూపాయలు అందుకుని టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యింది కాజల్.రీసెంట్ గా రకుల్ కూడా వెటరన్ హీరోస్ పక్కన నటించడానికి రెండు కోట్లు డిమాండ్ చేస్తుంది.స్టార్ డమ్ లేని హీరోలతో పెయిర్ అప్ ఆవాలన్నా కూడా అదే పరిస్థితి.ఇదంతా చూస్తే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే పాత సామెత ని వీళ్లంతా సీరియస్ గా ఫాలో అయిపోతున్నారు అనే విషయం అర్ధమవుతుంది.