pooja hegde joins in akhil akkineni s most eligible bachelor shooting sets

Most Eligible Bachelor Shooting Starts: అఖిల్ అక్కినేని (Akhil), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ షూటింగ్ మళ్లీ తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని పూజా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్‌లు ఇప్పుడు మెల్లగా ప్రారంభమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. సోమవారం (సెప్టెంబర్ 14) ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌ను ఇరవై రోజుల లోపు కంప్లీట్ చేస్తే మొత్తం సినిమా పూర్తయిపోతుంది. తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలుపెడతారు. ప్రస్తుతం లొకేషన్‌లో పూజా హెగ్డేపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చాలాకాలం తర్వాత షూటింగ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందంటూ లొకేషన్‌లో తీసుకున్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది పూజ.

అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కోసం ఈ అక్కినేని హీరో బాగా కష్టపడుతున్నారు. ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.