పూజా హెగ్డే కోసం 5 రోజులు నడిరోడ్డుపై పడుకున్న అభిమాని

0
1692
Pooja Hegde Met Her Crazy Fan In Mumbai-
Pooja Hegde Met Her Crazy Fan In Mumbai-

తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న పూజా హెగ్డేకు అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఆమె నటిస్తున్న చిత్రాలు సూపర్ డూపర్‌హిట్స్ అవుతున్నాయి. ఈ సంక్రాంతికి కూడా అలా వైకుంఠపురములో చిత్రంలో సందడి చేస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. తాజాగా ఓ వీరాభిమాని తన అభిమాన హీరోయిన్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఏకంగా ఐదు రోజుల పాటు ఫుట్‌పాత్‌పై పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను పూజా హగ్డేనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

ఆమెతో మాట్లాడడం కోసం ఒక తెలుగు అభిమాని 5 రోజుల పాటు ముంబైలో ఆమె అపార్ట్ మెంట్ ముందు రోడ్డుపై పడుకొని మరీ వెయిట్ చేశాడు. అది గమనించిన పూజా అతడ్ని కలిసింది, కాసేపు మాట్లాడింది.. ఆ వీడియోను ఇన్స్టాగ్రమ్ లో షేర్ చేసింది. తనతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి కానీ ఇలా రోడ్డు మీదకి రాకండి అని కోరుతూనే.. ఇలాంటి వీరాభిమానులు తనకు ఉన్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

 

 

Previous articleVijay silences people with his intense second look poster
Next articleReport: Entha Manchivaadavuraa first day collections