Pooja Hegde As Vibha For Most Eligible Bachelor movie

most eligible bachelor: Pooja Hegde: నేడు (అక్టోబర్ 10) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బుట్టబొమ్మకు అరుదైన కానుకలు అందాయి. అందులో ఒకటి డార్లింగ్ ప్రభాస్ ఇచ్చినది. ఇంకొకటి అక్కినేని చియాన్ అఖిల్ ఇచ్చినది. `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్` నుంచి కూడా పూజా లుక్‌తో కూడిన పోస్టర్‌ విడుదల చేశారు.

తాజాగా అఖిల్ సరసన నటిస్తున్న పోస్టర్ రిలీజైంది. పూజా హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (MEB) నుండి ఈ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇందులో కాలేజ్‌కి వెళ్లే మోడ్రన్ అమ్మాయిగా యమ స్టైలిష్‌గా కనిపిస్తోంది పూజా. ఈ లుక్ చూసి మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్లో పూజా విద్యార్థిగా కనిపించనుంది. చినుగుల డెనిమ్ టీ టాప్ లో అదరగొడుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తుండగా.. పూజా గ్లామర్ బ్యూటీగా కెమెరా ముందుకొచ్చింది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. లాక్ డౌన్ అనంతరం గత నెలలో దాని షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు.డిసెంబర్ విడుదలను లక్ష్యంగా పెట్టుకుని పూర్తి చేస్తున్నారట.