హ్యాట్రిక్‌ కొట్టేందుకు బుట్టబొమ్మ గట్టి ప్లాన్‌..?

0
2611
Pooja Hegde Romance with Allu Arjun Again In ICON movie

Pooja Hegde Allu Arjun: చిత్రసీమలో సెటిమెంట్ ను బాగా నమ్ముతారు. హీరో- హీరోయిన్ కాంబో లో హిట్ పడితే మరోసారి వారిద్దరినే ఎంపిక చేస్తారు. దిల్‌రాజు నిర్మించిన `డీజే`లోనూ తనే హీరోయిన్‌ కావడంతో, బన్నీ, పూజాల జోడీకి మంచి క్రేజ్‌ ఉన్న నేపథ్యంలో వీరిద్దరి మరోసారి తెరపై చూపించాలని పట్టుబడుతున్నాడట దిల్‌రాజు.

అల్లు అర్జున్‌, పూజా హెగ్డే ఇప్పటికే `డీజేః దువ్వాడ జగన్నాథమ్‌`, `అల వైకుంఠపురములో` చిత్రాల్లో నటించారు. `డీజే` యావరేజ్‌గా నిలవగా, `అల వైకుంఠపురములో` చిత్రం సంచలన విజయం సాధించింది. నాన్‌ `బాహుబలి` రికార్డ్ లను తిరగరాసింది. తాజాగా ఈ జోడీని మరోసారి జత కలవబోతున్నారు.

Pooja Hegde to romance Allu Arjun again in ICon Film

వేణు శ్రీరామ్ డైరెక్షన్లో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కబోయే `ఐకాన్` మూవీ లో పూజ హగ్దే ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారని, మరో హీరోయిన్‌గా రష్మిక మందనను ఫైనల్ చేశారని సమాచారం. మరి మూడోసారి ఈ జంట మ్యాజిక్‌ చేస్తుందేమో చూడాలి.