Mahesh – Nithiin లతో రొమాన్స్ చేయనున్న బుట్టబొమ్మ..!

0
62
Pooja hegde to romance with Nithin and Mahesh next movies

Mahesh Babu- Nithiin: స్టార్ హీరోలకు ఏకైక ఛాయిస్ గా మారిపోయిన పూజా (Pooja).. గతేడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ – డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబోలో ‘సర్కస్’.. అలానే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తోంది పూజా(Pooja Hegde).

ఇలా మూడు భాషల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న పూజా హెగ్డే (Pooja Hegde).. డిమాండ్ కు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ (remuneration) కూడా తీసుకుంటుందని తెలుస్తోంది. తెలుగులో ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న పూజాహెగ్డే.. మరో సినిమాని ఓకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది. నితిన్‌ హీరోగా తదుపరి ఏ సినిమా రూపొందనుందనే దానిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ రైటర్‌, డైరెక్టర్‌ వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అదేంటంటే.. ఈ చిత్రంలో నితిన్ (Nithiin) జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుందట. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్‌ మూవీస్‌లో చేయబోతున్నారు. బన్నీతో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన వంశీ తెరకెక్కించనున్న రెండో చిత్రమిది.

Pooja Hegde Up coming movies 2022

పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’.. అఖిల్ అక్కినేని సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కనిపించనుంది. నితిన్ సినిమాతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) సినిమాకి కూడా పూజా (Pooja) సైన్ చేసినట్లు టాక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ‘#SSMB28’ చిత్రంలో బుట్టబొమ్మ నే హీరోయిన్ గా ఫైనలైజ్ చేసారట.