గుంటూరు కారం అంటూ ప్రేక్షకుల ముందుకు వీర మాస్ లెవెల్ లో వస్తున్న మహేష్ బాబు చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ లో మహేష్ బాబు మాస్ గెటప్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దాని తర్వాత ఈ మూవీ బాగా వార్తల్లో వైరల్ అవుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ మహేష్ బుక్స్ గురించి లేక సినిమాకు సంబంధించిన స్టోరీ గురించి కాకుండా వేరే యాంగిల్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అదేమిటి అంటారా…వరుసగా మూవీ నుంచి బయటకు వస్తున్న ముఖ్యమైన వ్యక్తుల విషయంలో ఇది బాగా వైరల్ అవుతుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు మరియు ఖలేజా చిత్రాలు మహేష్ బాబు కెరియర్ లోనే మైలురాళ్ళు అని చెప్పవచ్చు. అతడు సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ ఖలేజా ఆ రేంజ్ అందుకోలేకపోయింది. హిట్ కాకపోయినా ఇప్పటికి ఖలేజా సినిమాకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో ఇది మంచి యాక్టర్ కి హిట్ అవుతుంది అని ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మూవీ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి ఈ చిత్రం చెప్పు ఏదో ఒక వివాదం నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రాజెక్ట్ నుంచి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తప్పకుండా వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదు అని తర్వాత స్వయంగా మూవీ మేకర్స్ స్పష్టం చేయడం జరిగింది.
అయితే ఈ నేపథ్యంలో డేట్స్ సమస్యల కారణంగా పూజా హెగ్డే ఈ మూవీ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే మరోపక్క చిత్రంలో తన క్యారెక్టర్ కంటే శ్రీ లీల క్యారెక్టర్ కి ప్రామినన్స్ ఎక్కువ ఇవ్వడం తో

పూజా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అయితే ప్రస్తుతం మూవీ నుంచి పూజా హెగ్డే ఇలా సడన్ గా తప్పుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఏదో ఒక కారణంతో గుంటూరు కారం షూటింగ్ టైమ్‌లైన్‌లు వరుసగా మారుతూనే వస్తున్నాయి. ఇప్పటికే షూట్ చేసిన కొన్ని భాగాలు కూడా తిరిగి రీషూట్ మోడ్‌లోకి వస్తున్నాయి అలాగే స్క్రిప్ట్ లో కూడా మార్పులు జరుగుతున్నాయి.