Poonam Kaur Sensational Comments Over Priyanka Reddy Assassination
Poonam Kaur Sensational Comments Over Priyanka Reddy Assassination

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. గతంలో కూడా ఎన్నో విషయాల గురించి ఆమె తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ అభిమానులు ‘రేణూ దేశాయ్’ మీద ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేసిన సమయంలో కూడా పూనమ్ రేణు దేశాయ్ కు అండగా నిలిచారు. ఎలా పడితే అలా కామెంట్లు చేసే వారికి కనీసం బుద్ధి ఉండదని ఆమె అన్నారు.

ఇప్పుడు వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం జరిగిన ఘటనపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఇది చాలా ఘోరమైన ఘటన అని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పూనమ్ కౌర్ కూడా ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పూనమ్ కౌర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి వాళ్ళను చంపడానికైనా తాను సిద్ధమేనని.. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన క్రూరులు జైలు శిక్ష అనుభవించడం కాదనీ.. వాళ్లను చంపి నేను జైలుకెళతాననీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుల్లో ఒకరి మతం గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని, ఇక్కడ మతం సమస్య కానేకాదని అన్నారు. ఇలాంటి సమస్యకు పరిష్కారాలు ఆలోచించాలే తప్ప రాజకీయాలు చేయాలని చూడొద్దని ఆమె అన్నారు.

ప్రియాంక తండ్రి పోలీసులను ఆశ్రయించగా, మీ కుమార్తె ఎవరితోనో వెళ్లిపోయుంటుందేమో అని పోలీసులు అన్నారన్న వ్యాఖ్యలపై నటి పూనమ్ కౌర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న ఓ అమ్మాయిని లేచిపోయిందేమో అనడానికి పోలీసులకు సిగ్గు లేదా? అని ప్రశ్నించారు.