ఆది ‘శశి’ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్న పవన్ కళ్యాణ్

419
Power star Pawan kalyan to Unveil Sashi Trailer
Power star Pawan kalyan to Unveil Sashi Trailer

సాయికుమార్ తనయుడు ఆది హీరోగా శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శశి’. ఇందులో సురభి, రాశీసింగ్ హీరోయిన్స్. ఈ నెల 19న విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘ఒకే ఒక లోకం’ పాట విడుదలై సూపర్ హిట్ అయింది.

 

 

ఈ సినిమా ట్రైలర్ ను 10 తేదీ ఉదయం పదిగంటల పది నిమిషాలకు పవన్ కళ్యాణ్‌ విడుదల చేయనున్నారు. రాజీవ్ కనకాల, అజయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ చిలివేరు సంగీతం అందిస్తున్నారు. ఆర్.పి. వర్మ, చావలి రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మాతలు. తమ పాటలకు ఎలాంటి స్పందన లభిస్తుందో సినిమాకు కూడా అదే స్థాయిలో ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉందంటున్నారు దర్శకనిర్మాతలు.