హరీష్ పవన్ నెక్స్ట్ మూవీ టైటిల్ అదిరిపోయిందిగా..!

0
76
Powerful title for Pawan kalyan Harish Shankar PSPK 28 film

Pawan Kalyan, Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాల లైనప్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం పవన్ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నాడు. చిత్రాలు పూర్తయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వంలో చిత్రం షురూ అవుతుంది. ఇటీవలే పవన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. పోస్టర్ తోనే పవన్ అభిమానుల్లో వేడి పెంచాడు.

పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న కాంబినేషన్స్ లో ఇది కూడా ఒకటి. దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్నారు. ఇంతలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్టేడ్ అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి `భవదీయుడు భగత్ సింగ్` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ప్రచారంలోకి వచ్చింది.

పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే టైటిల్ అని కామెంట్స్ వస్తున్నాయి. ఈ టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదని వర్కింగ్ టైటిల్ మాత్రమే అని కూడా అంటున్నారు. గతంలో సంచారి అనే టైటిల్ కూడా ప్రచారం జరిగింది. అభిమానులకు నచ్చే టైటిల్ మాత్రం భవదీయుడు భగత్ సింగ్’ అనే చెప్పాలి.

Harish Shankar Locked Powerful title for Pawan kalyan Film

హరిహర వీరమల్లు 2022 సంక్రాంతికి విడుదలవుతుంది. ఈలోగానే భీమ్లానాయక్ చిత్రీకరణ శరవేగంగా పూర్తయిపోతోంది. ఇది వచ్చే సమ్మర్ కి వచ్చే వీలుందని అంచనా. హరీష్ తో సినిమాని ప్రారంభించి అటుపై సురేందర్ రెడ్డితోనూ పని చేసేందుకు పవన్ సన్నాహకాల్లో ఉన్నారు.