Prabhas 2024 movies shooting updates, Salaar Part 2 Release Date, Kalki 2898 AD shooting details, Prabhas Maruthi film details, Prabhas Upcoming movie news
2024లో ప్రభాస్ సినిమాలు విడుదలయ్యే అవకాశం లేదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.. ఇది ప్రభాస్ అభిమానులకు విషాదకరమైన వార్తే.. కానీ ఆయన చేయబోయే సినిమాల షూటింగ్ అప్డేట్ చూస్తుంటే 2024లో ప్రభాస్ సినిమా విడుదల కాకపోవడం అనివార్యమైంది. ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు సాలార్ 2 మరియు Kalki – 2898 AD అలాగే దీనితోపాటు మారుతి సినిమా, సందీప్ Spirit movies లైన్ లో ఉన్నాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సాలార్ డిసెంబర్ 22న విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే దీని తర్వాత ప్రభాస్ కల్కి 2898 ADని మొదట 2024 సంక్రాంతికి ప్లాన్ చేశారు, కానీ షూటింగు అలాగే దీనికి సంబంధించిన VFX ఆలస్యం కారణంగా మేకర్స్ ఈ సినిమాని 2024 వేసవికి విడుదల చేయాలని ప్లాన్ లో ఉన్నారు.. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నాగ్ అశ్విన్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తర్కెక్కిస్తున్నారు.

నాగ్ అశ్విన్ సినిమాలోని ప్రతి విషయంలోనూ చాలా పర్టిక్యులర్ గా చెప్పడంతో పాటు సినిమాతో బెస్ట్ అవుట్‌పుట్ అందించాలని భావిస్తున్నందున ఈ సినిమా 2024లో విడుదలయ్యే అవకాశం లేదనేది తాజా బజ్. అలాగే ఈ సినిమాలో సీజీ వర్క్ ఎక్కువగా ఉండడంతో మేకింగ్ కు చాలా సమయం పడుతోంది.
ఈ చిత్రం 2025 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది మరియు ప్రభాస్ ప్లాన్ ప్రకారం మారుతీ చిత్రం కల్కి తర్వాత మాత్రమే విడుదల అవుతుంది. సాలార్ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది, ప్రభాస్ తదుపరి చిత్రం 2025లో విడుదల కానుంది. కాబట్టి 2024లో ప్రభాస్ సినిమా విడుదలయ్యే అవకాశం లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది.