Adipurush Trailer Screening theaters list: ప్రభాస్ (Prabhas) అలాగే కృతి సనన్ నటించిన ఆదిపురుష్ ట్రైలర్ కి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. ఆదిపురుష్ ట్రైలర్ (Adipurush Trailer) ని మే 9న విడుదలకు సిద్ధం చేశారు. అంతేకాకుండా ఈ సినిమా మేకర్స్ మీడియాకి అలాగే ఫ్యాన్స్ కోసం 3d ట్రైలర్ ని చూపించడానికి ప్లాన్ చేయటం జరిగింది.
ప్రభాస్ (Prabhas) వరుస భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాల్లో ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నది ఆదిపురుష్ (Adipurush). ప్రభాస్ మొట్టమొదటిసారిగా మైథలాజికల్ సినిమాలో నటించారు.. ఈ సినిమాలో రాముడు పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఆదిపురుష్ టీజర్ (Adipurush Teaser) అలాగే సాంగ్స్ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. జూలై 16న విడుదలకు సిద్ధం చేసిన ఆదిపురుష్ సినిమా ట్రైలర్ నీ May 8న మీడియా ప్రతినిధులకు అలాగే May 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేయటం జరిగింది.
అలాగే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లలో ఆదిపుష్ ట్రైలర్ (Adipurush Trailer) ని విడుదలకు సిద్ధం చేయడం కూడా జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ని మే 9న సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 105 థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. 3 నిమిషాలు నిడివి కలిగిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుందని మూవీకి సంబంధించిన సన్నిహితులు చెబుతున్నారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ చేయటానికి అన్ని విధాలుగా దర్శకుడు ప్లాన్ చేసినట్టు సమాచారం తెలుస్తుంది. ఆదిపుష్ ట్రైలర్ (Adipurush Trailer) ప్రతి ఒక్కరిని రామాయణం ప్రపంచంలోకి తీసుకెళ్తుందని అంటున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఆదిపురుష్ సినిమాని ఒకేసారి విడుదలకు సిద్ధం చేశారు..