‘ఆదిపురుష్’ వీఎఫ్‌ఎక్స్‌ కోసం భారీ బడ్జెట్..!

0
1347
Makers of Prabhas' Adipurush Will Spend Rs 250 cr for VFX

‘ఆదిపురుష్’ సినిమాను ప్రభాస్ ప్రకటించిన దగ్గర నుంచీ దీని గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ చిత్రంగా ‘ఆదిపురుష్’ ఉండబోతోందని.. వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించబోతున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఈ సినిమాలో రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారని టాక్ కూడా వినిపించింది. అయితే, ఈ సినిమాపై ఇప్పుడు మరో వార్త హాట్ టాపిక్‌గా మారింది.

‘ఆదిపురుష్’లో ‘బాహుబలి’కి మించి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే “ఆదిపురుష్” సినిమా ముందు “బాహుబలి” బడ్జెట్ జూజూబి అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎక్కువగా ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కోసం రెండు వందల యాభై కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నారట. బాహుబలి రెండు సినిమాల కోసం దాదాపు వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కోసం 200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే దానికి మించి ఈ సినిమాలో నిర్మాతలు ఖర్చు చేయబోతున్నారట. మొత్తంమీద చూసుకుంటే ఈ “ఆది పురుష్” సినిమా కి వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్.

కాగా, ‘ఆదిపురుష్’ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన తొలి హిందీ సినిమా ఇదే. ఇప్పుడు ‘ఆదిపురుష్’తో టాలీవుడ్‌లోకి కూడా ఆయన అడుగుపెడుతున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత తమిళం, మలయాళం, కన్నడ ఇతర భాషల్లోకి అనువాదం చేయనున్నట్లు త్రీడీ యాక్షన్ తరహాలో సినిమా ఉంటుందని సమాచారం.

అంతేకాకుండా సినిమా లో భారీ సెట్లు, కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ ఉండేలా నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారట. ఈ సినిమాని గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిలింస్ సమర్పణలో రెట్రోఫిలిస్ ప్రొడక్షన్, టి-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Previous articleNaga Chaitanya’s Next With Vikram Kumar Title Fix
Next articlewhopping budget for Prabhas Adipurush VFX