రెబెల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ మోషన్ క్యాప్చర్ షూట్ ప్రారంభం..!

0
172
Prabhas And Saif Ali Khan's Adipurush Begins Motion Capture Shoot

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా ఫిల్మ్, మాగ్నమ్ ఓపస్ ఆదిపురుష్ మోషన్ క్యాప్చర్ కార్యక్రమాలు జనవరి 19న మొదలయ్యాయి. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, రెట్రోఫిల్స్ బ్యానర్ పై ఓం రౌత్, ప్రసాద్ సుటర్, రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదిపురుష్ ఫిబ్రవరి 2న ముహూర్త కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా.. నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ, ” మా టీ సిరీస్ బ్యానర్ ద్వారా మేమెప్పుడూ కొత్త ఐడియాస్ నీ, టెక్నాలజీ నీ ప్రోత్సహిస్తూ వస్తున్నాం. ఇది కొత్త తరహా ఫిల్మ్ మేకింగ్ కి దోహదపడుతుంది. దర్శకుడు ఓం రౌత్, ఆదిపురుష్ టీమ్ లేటెస్ట్ టెక్నాలజీ తో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఇంటర్నేషనల్ ప్రమాణాలతో కూడిన ఈ సాంకేతికత ఇండియన్ సినిమాలో రావడం ఇదే మొదటి సారి. ప్రభాస్ హీరోగా అత్యున్నత ప్రమాణాలతో మన ప్రేక్షకులకు ఆదిపురుష్ ను అందిస్తున్నందుకు గర్వంగా ఉంది.” అన్నారు

మారో నిర్మాత ప్రసాద్ సుతర్ మాట్లాడుతూ, ” రియల్ టైమ్ టెక్నాలజీ తో కూడిన హై ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇంటర్నేషనల్ చిత్రాలలో ఉపయోగిస్తుంటారు. స్టోరీ ను నేరెట్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఆదిపురుష్ లాంటి ఎపిక్ ను, ఆ ప్రపంచాన్ని నిర్మించడానికి మేము ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాము. ఆదిపురుష్ మా అందరికీ ఒక భారీ మిషన్. ప్రభాస్, భూషణ్ జీ లతో కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది.”

Prabhas And Saif Ali Khan's Adipurush title first look HD poster

 

Previous articlePrabhas And Saif Ali Khan’s Adipurush Begins Motion Capture Shoot
Next articleVarun Tej Ghani First look and Motion poster Released