Adipurush Nizam Collection: బాహుబలి మూవీ తో ప్రభాస్ (Prabhas) ఎవరు ఊహించని విధంగా రికార్డు సృష్టించడమే కాకుండా పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు పొందాడు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ని ఓ రేంజ్ లో నిలబెట్టిన ఈ చిత్రం రెండు భాగాలలో వచ్చినప్పటికీ రెండు భాగాలు కలిపి వేల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. అయితే ఆ తర్వాత ఎన్నో భారీ అంచనాల మధ్య ప్రభాస్ నటించిన రెండు చిత్రాలు నిరాశను మిగిల్చాయి.
Adipurush Nizam Collection:ఫేమస్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో ప్రభాస్ నటించిన సాహో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య భారీ హంగులతో విడుదల అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. అయితే ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ కూడా అనుకున్నట్లు విజయం సాధించ లేకపోయింది. ఈ రెండిటి తర్వాత భారీ అంచనాల మధ్య తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో చిత్రీకరించినటువంటి ఈ విజువల్ వండర్ లో ప్రభాస్ రాముడి పాత్ర పోషించారు.
విడుదలకు ముందే చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అవ్వడంతో అడ్వాన్సుల్ బుకింగ్ తో ఈ చిత్రం విపరీతమైన కలెక్షన్స్ మొదటి మూడు రోజుల్లోనే సంపాదించింది. అయితే చిత్రం విడుదలైన తర్వాత స్టోరీ పరంగా మరియు కొన్ని డైలాగ్స్ పరంగా పలు రకాల అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మూవీపై విపరీతమైన ట్రోల్స్ చేశారు. చిత్రాన్ని బ్యాన్ చేయాలి అని ఓ చిన్న మినీ పోరాటమే సోషల్ మీడియాలో మొదలైంది.
అయితే ఈ చిత్రం వసూళ్ల పరంగా మాత్రం మంచి రికార్డునే సృష్టించింది. బాహుబలి (రూ. 43 కోట్లు),బాహుబలి 2 (రూ. 68 కోట్లు) వసూలు రావటగా ప్రస్తుతం ఆదిపురుష్ నైజాం ప్రాంతంలో ఇప్పటి వరకు రూ. 36.20 కోట్ల షేర్ వసూలు చేసి ప్రభాస్ కెరియర్ లో నైజాం నుంచి 30 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించిన మూడవ చిత్రంగా నిలిచింది. విమర్శలు ఎంత వెల్లువెత్తుతున్న ఇప్పటివరకు ఎక్కడ మనం ప్రభాస్ గురించి ఎటువంటి నెగటివ్ కామెంట్ వినలేదు.

రోల్ పరంగా ప్రభాస్ బాగా నటించాడు అన్న ఒక్క మాట తప్ప ఎక్కడ ఈ చిత్రం గురించి ప్రభాస్ పై ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేకపోవడం అతనికి టాలీవుడ్ లో అభిమానులు ఎంతమంది ఉన్నారు అనేదానికి మరోసారి నిదర్శనం. అయితే చిత్రంలోని పలు రకాల సన్నివేశాలు మరియు అస్తవ్యస్తంగా తీసిన గ్రాఫిక్స్పై ప్రజల తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంత భారీ చిత్రమైనా కంటెంట్ కరెక్ట్ గా లేకపోతే ఆడడం కష్టం అనేదానికి ఈ చిత్రం ఒక నిదర్శనంగా నిలబడింది.